Begin typing your search above and press return to search.
కేసీఆర్ మాటకు మాట అనేసిన ఉత్తమ్
By: Tupaki Desk | 10 Oct 2016 10:02 AM GMTమాటకు మాట అనుకోవటం దూకుడు రాజకీయాల్లో ఎక్కువైంది. ఎవరి ఎవరినైనా ఇష్టారాజ్యంగా మాటలు అనేయటం ఈ మధ్యన ఎక్కువైంది. ఎవరిని ఎవరు ఎంత మాటలైనా అనుకోవచ్చన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి తెలివి లేదని మండిపడుతూనే.. ఉత్తమ్ కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లుగా తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెలరేగిపోయారు. మీడియా సమావేశం పెట్టి మరీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి అహంకార ధోరణితో పాలన చేస్తున్నారని.. ఇదే మాత్రం పద్ధతి కాదన్న ఆయన.. ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తుగ్లక్ పాలన సాగుతుందని ప్రజలంతా అనుకుంటున్నట్లుగా చెప్పిన ఉత్తమ్.. తాము జిల్లాల ఏర్పాటుకు వ్యతిరేకం కాదని.. కానీ శాస్త్రీయంగా జిల్లాల్ని విభజించకపోవటాన్ని ప్రశ్నించారు.
తమపై విమర్శలు చేసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని విమర్శలు చేయాలంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఆయన మాటలకు కౌంటర్ అన్న చందంగా ఉత్తమ్ మండిపడుతూ.. ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకొనే మాట్లాడాలన్నారు. వర్షాలు విస్తారంగా కురిసిన వేళ.. తెలివి ఉన్నోళ్లు ఎవరైనా రైతుల సమస్యల గురించి మాట్లాడతారా? అంటూ ఎటకారం చేసుకున్న కేసీఆర్.. ‘‘సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవటంలోనూ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు తెలివిలేదు. తెలివితక్కువగా ఆలోచిస్తుంటారు’’ అంటూ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై ఉత్తమ్ రియాక్ట్ అయ్యారు.
రైతులకు ఈ ఏడాది ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అబద్దాలు చెప్పటం ఇష్టమన్న ఉత్తమ్.. దేశంలో ప్రజల్ని కలవని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని.. ఆయనలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెవరూ ఉండదరంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/