Begin typing your search above and press return to search.

ఢిల్లీ దీక్ష కామెడీ మ‌ర్చిపోక ముందే మ‌ళ్లీ దీక్షా త‌మ్ముళ్లు?

By:  Tupaki Desk   |   2 July 2018 9:59 AM GMT
ఢిల్లీ దీక్ష కామెడీ మ‌ర్చిపోక ముందే మ‌ళ్లీ దీక్షా త‌మ్ముళ్లు?
X
రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు విష‌యంలో నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రించ‌టం టీఆర్ఎస్ కు మొద‌ట్నించి అల‌వాటే. ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా విరుచుకుప‌డ‌టం.. అవ‌స‌రానికి మించిన తీవ్ర‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌టం .. ఆరోప‌ణ‌ల‌తో ముకుమ్మ‌డి దాడి చేయ‌టం లాంటివి ప్ర‌ధాన ఆయుధాలుగా చెప్పాలి. ఉద్య‌మ పార్టీగా ఉండే అడ్వాంటేజీని పూర్తిగా వినియోగించుకున్న టీఆర్ఎస్‌.. అధికార పార్టీగా అదే తీరును ప్ర‌ద‌ర్శించ‌టం గొప్ప విష‌యమ‌నే చెప్పాలి.

ఉద్య‌మ పార్టీ నుంచి అధికార‌పార్టీగా మారినప్ప‌టి నుంచి డిఫెన్స్ లో ప‌డ‌తారు. కానీ.. కేసీఆర్ స‌ర్కారు అందుకు మిన‌హాయింపుగా చెప్పాలి. త‌మ‌దైన దూకుడును ప్ర‌ద‌ర్శిస్తూ ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించ‌టంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆయ‌న కుమారుడు కేటీఆర్ లు త‌మ‌దైన మార్కులు చూపిస్తున్నారు.

తాజాగా డోస్ మ‌రింత పెంచిన కేటీఆర్ కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అమ్మా కాదు బొమ్మా కాదంటూ ఆయ‌న విరుచుకుప‌డ‌ట‌మే కాదు.. తెలంగాణ ప్ర‌జ‌లు చొక్కా ప‌ట్టుకొని నిల‌దీసే ప‌రిస్థితుల్లో మాత్ర‌మే తెలంగాణ ఇచ్చారు త‌ప్పించి మ‌రింకేమీ లేద‌న్న మాట‌ను ఆయ‌న నోటి నుంచి వ‌చ్చింది.

ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌.. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తున్న కేటీఆర్.. ఎన్నిక‌ల నాటికి ఆ తీవ్ర‌త మ‌రెంత పెరుగుతుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ కార‌ణంతోనే కావొచ్చు.. కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఉత్త‌మ్ తో స‌హా ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. మిగిలిన వారంతా మీడియా ముందు విరుచుకుప‌డితే.. ఉత్త‌మ్ మాత్రం కేటీఆర్ కు పంచ్ లు వేసేందుకు సోష‌ల్ మీడియాను ఉప‌యోగించారు.

ట్విట్ట‌ర్ ద్వారా కేటీఆర్ కు పంచ్ లు వేశారు. దీనికి ప్ర‌తిగా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని వ‌దిలిపెట్ట‌ని ఉత్త‌మ్ మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఈసారి కేసీఆర్ ను సీన్లోకి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ అసెంబ్లీలో కేసీఆర్ చేసిన మాట‌ల్ని ట్విట్ట‌ర్ లో కేటీఆర్‌ కు షేర్ చేసి పంచ్ ఇచ్చారు.

సోనియా గాంధీ గురించి అసెంబ్లీలో మీ నాన్న కేసీఆర్ అన్న మాట‌లు విను అంటూ తండ్రి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చి కేటీఆర్ ను ఢిపెన్స్ లో ప‌డేలా చేశారు. త‌న తాజా ట్వీట్ తో సోనియాపై కేటీఆర్ దుందుడుకు వ్యాఖ్య‌లు చేసిన వైనాన్ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లైంది. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్ వ్యాఖ్యానిస్తూ తెలంగాణ ఏర్పాటుకు సోనియా చేసిన కృషిని ఎవ‌రూ కాద‌న‌లేద‌ని.. సోనియా వ‌ల్లే తెలంగాణ క‌ల సాకార‌మైంద‌న్నారు. కాద‌న్న వారు మూర్ఖులుగా అభివ‌ర్ణించారు. తాజా ఎపిసోడ్‌లో త‌న వ‌రుస ట్వీట్ల‌తో కేటీఆర్ కంటే త‌న పైచేయిని ఉత్త‌మ్ ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.