Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కమిషనర్ వేస్ట్ ఫెలో.. ఉత్తమ్ ఫైర్

By:  Tupaki Desk   |   29 Dec 2019 5:52 AM GMT
హైదరాబాద్ కమిషనర్ వేస్ట్ ఫెలో.. ఉత్తమ్ ఫైర్
X
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర పదజాలంతో తిట్టిపోశారు. కాంగ్రెస్ ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదంటూ పోలీస్ కమిషనర్ పై మండిపడ్డారు.అధికార టీఆర్ఎస్ కు తొత్తులా సీపీ వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేస్తారా? ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కవాతుకు సీపీ అంజనీకుమార్ అనుమతి ఇచ్చారని.. కానీ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి నిరాకరించారని ధ్వజమెత్తారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతామంటే అనుమతి నిరాకరించారని మండిపడ్డారు. గాంధేయ పద్ధతిలో గాంధీభవన్ లో నిరసన తెలుపుతాం అని చెప్పినా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.

మా జెండా ఆవిష్కరణకు కార్యకర్తలకు అనుమతి ఇవ్వలేదని.. గాంధీ భవన్ చుట్టూ పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏముందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నగర సీపీ వైఖరి సరిగాలేదని.. ఓవరాక్షన్ చేస్తే అంతుచూస్తామని.. వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఉత్తమ్ నిప్పులు చెరిగారు.

హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఆర్ఎస్ఎస్, కేసీఆర్ లకు తొత్తుగా మారాడని ఉత్తమ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని అవమాన పరిచేలా ప్రవర్తించాడంటూ మండిపడ్డారు. అంజనీకుమార్ నీ సంగతి చూస్తాం అంటూ హెచ్చరించారు. నీ ఉద్యోగం నువ్వు చేసుకొని పో అంటూ ఉత్తమ్ తీవ్రంగా మండిపడ్డారు.