Begin typing your search above and press return to search.
తెలంగాణకు కేసీఆర్ మహా ద్రోహం చేస్తున్నారట
By: Tupaki Desk | 23 Aug 2016 7:02 AM GMTమహా ఒప్పందం అంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై తీవ్రస్థాయిలో నిప్పులు కక్కుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకోనున్న చారిత్రాత్మక ఒప్పందంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ సర్కారుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రభుత్వం మోసగించే ప్రయత్నం చేస్తుందన్న ఆయన.. మహారాష్ట్రతో ఒప్పందం కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు శాశ్విత ద్రోహం చేస్తుందని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రతో ఒప్పందం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్నితీవ్రంగా దెబ్బ తీస్తుందని.. అందుకే ప్రతి జిల్లాలోనూ తమ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తారన్నారు. తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా తక్కువ ముంపు.. తక్కువ వ్యయంతో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును వద్దని.. తెలంగాణకు నష్టం చేసే కాళేశ్వరం ప్రాజెక్టును చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.
కమిషన్ల కోసమే ఇదంతా చేస్తున్నారంటూ మండిపడిన ఉత్తమ్.. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నాల్ని అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెల్లడించిన వాస్తవ జలదృశ్యంకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రతో చేసుకుంటున్న ఒప్పందం మహా ఒప్పందం కాదని మహా ద్రోహంగా అభివర్ణిస్తున్న తెలంగాణ కాంగ్రెస్.. తన మాటలకు తగ్గ వాస్తవ సమాచారాన్ని తమ మాటలతో చెప్పటం లేదన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ సర్కారు ద్రోహం చేస్తుందన్న హడావుడి మాటలు తప్పించి.. ప్రజలు కన్వీన్స్ అయ్యే లాజిక్ చెప్పటంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో తప్పు దిద్దుకోకుంటే.. తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బ తీసే విపక్షంగా తెలంగాణ ప్రజల మనసుల్లో రిజిష్టర్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు.