Begin typing your search above and press return to search.

ఉత్తమ్ కుమార్ ని బూతులు తిట్టేశాడు

By:  Tupaki Desk   |   8 Jun 2015 4:18 PM GMT
ఉత్తమ్ కుమార్ ని బూతులు తిట్టేశాడు
X
ఉత్తమ్‌ కుమార్‌ కాదు...ఎంత మంది ఉత్తర కుమారులొచ్చినా నల్గొండ జిల్లా దాహర్తిని తీరుస్తాం. మీరు ఎప్పుడూ సీఎంలు కాలే. మీ వాళ్ళు ఆంధ్రా నాయకులకు సంచులు మోశారే తప్ప... మీకు అధికారం రాలే. ఇంకా పథకమే ప్రారంభం కాలేదు. అప్పుడే అవాకులు చెవాకులు పొగుడుతున్నారు. సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా... టీఆర్‌ఎస్‌ జగమొండి పార్టీ. అంతు చూసేదాకా వదలం. మీకు చిల్లర రాజకీయాలు తప్ప... అభివృద్ధి పట్టదు' అంటూ టి.కాంగ్రెస్‌ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిపై నిప్పులు చెరిగారు కేసీఆర్‌.

వాటర్‌గ్రిడ్‌ పథకం ప్రారంభంలో పాల్గొన్న కేసీఆర్‌... కాంగ్రెస్‌ పార్టీనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. నేను మొండోణ్ని. నా పార్టీ మొండిది. పథకం అమలుచేసి తీరుతా.. మీకు బుద్ధి చెబుతా. ఇటీవల కాంగ్రెస్‌ నాయకులు ఓ మీటింగ్‌ ఏర్పాటు చేసుకుని 'వీడు కోతల్లేని కరెంట్‌ ఎలా ఇచ్చిండు' అంటూ చర్చించుకున్నారట. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చాలా చేస్తా. ఇలా ఎవరైనా ఇంతకు ముందు పాలకులు చేసిండ్రా. చిన్నారులకు సన్నబియ్యం, రైతులకు రెండో పంటకు నాగార్జునసాగర్‌ నీరు ఎలా వచ్చాయి. ఈ బక్కోడితోనే సాధ్యం అయింది. నేను చూడటానికి బక్కగా... సన్నగా వున్నా... ఏదైనా సంకల్పిస్తే...దాని అంతు చూసేదాకా వదలను అంటూ నల్గొండ ప్రజలను ఉత్సాహ పరిచాడు. ఆంధ్రా గుంటనక్క చంద్రబాబు తెలంగాణాకు రావాల్సిన వాటాను అడ్డుకుంటే... ఎంతో కష్టపడి కోతల్లేని విద్యుత్‌ ఇస్తున్నా.