Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్ర‌త్యేక‌త‌ను ప్ర‌క‌టించిన‌ ప్ర‌తిప‌క్షాలు

By:  Tupaki Desk   |   13 Oct 2016 1:44 PM GMT
కేసీఆర్ ప్ర‌త్యేక‌త‌ను ప్ర‌క‌టించిన‌ ప్ర‌తిప‌క్షాలు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తిప‌క్షాలు ప్ర‌త్యేక దృష్టి సారించాయి. కేసీఆర్ ఒక్క మాట అంటే తాము ప‌ది మాటలు అనేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ఇప్ప‌టికే చెప్పిన కాంగ్రెస్ తాజాగా త‌మ రాష్ట్ర ర‌థ‌సార‌థిని కేసీఆర్ త‌ప్పుప‌ట్ట‌డంపై భ‌గ్గుమంది. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ ఉత్త‌మాట‌లు మాట్లాడుతున్నారే త‌ప్పించి విమ‌ర్శ‌లు చేయ‌డం కూడా రాద‌ని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ముఖ్య‌ నేత‌లు ఫైర్ అయ్యారు. సీఎల్పీ నేత జానారెడ్డి - మండలి నాయ‌కుడు ష‌బ్బీర్ అలీ - కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు భ‌ట్టి విక్ర‌మార్క క‌లిసి కేసీఆర్ తీరుపై విరుచుకుప‌డ్డారు.

ప్ర‌తిప‌క్షాలు చేసేవి ఉత్త విమ‌ర్శ‌లో లేదంటే క్షేత్ర‌స్థాయి వాస్త‌వాల‌కు అద్దంప‌ట్టేవే తెలియాలంటే కేసీఆర్ జ‌నంలోకి వెళ్లాల‌ని కాంగ్రెస్ నాయ‌కులు వ్యాఖ్యానించారు. సీఎం హౌదాలో కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ సోయి తప్పి కాంగ్రెస్‌ పార్టీపైనా - తనపైనా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాని త‌ప్పుప‌ట్టారు. సీఎంగా ఉన్న‌ తన హోదాను మరిచిపోయి..కనీస సంస్కారం లేకుండా వ్యక్తగత విమర్శలకు దిగితే సహించేది లేదన్నారు. దేశంలో కేసీఆర్‌ లాంటి ముఖ్యమంత్రి మ‌రొక‌రు లేర‌ని ఉత్త‌మ్ విమ‌ర్శించారు. ప్రజలంటే సీఎంకు లెక్కలేనితనంగా ఉందని మండిప‌డ్డారు. తనను వ్యక్తగతంగా విమర్శించిన సీఎంను ఇక నుంచి ఏకవచనంతో సంబోధిస్తామని ఉత్త‌మ్ ప్ర‌క‌టించారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించే ఎమ్మెల్యేలు - మంత్రులను కలవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను మాత్రమే చూస్తున్నానని చెప్పారు. ఉద్యమ సందర్భంగా అనేక అబద్దాలు మాట్లాడిన కేసీఆర్‌...సీఎం స్థాయిలోనూ నిస్సిగ్గుగా అబద్దాల పరంపర కొనసాగిస్తున్నారని విమర్శించారు. అందుకే క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించాల‌ని కేసీఆర్‌ ను కోరుతున్న‌ట్లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/