Begin typing your search above and press return to search.
'కేసీఆర్ తెలివి తక్కువ పని'
By: Tupaki Desk | 4 Nov 2016 6:33 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటుగా విమర్శలు చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోమారు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి తాత్కాలికంగా వేరే చోటుకు తరలించి కొత్త భవనాలను నిర్మించాలన్న ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. సచివాలయాన్ని తరలించాలనే నిర్ణయం కేసీఆర్ చేస్తున్న తెలివితక్కువ పని అని మండిపడ్డారు. కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలంటే కోట్లాది రూపాయల వ్యయమవుతుందని, ఈ భారాన్ని ప్రజలపైన మోపడం తగదని బహిరంగ లేఖలో ఉత్తమ్ పేర్కొన్నారు.
వాస్తు కారణాలను చూపెట్టి సచివాలయం భవనాలను కూల్చాలనుకోవడం తగదని ఉత్తమ్ మండిపడ్డారు. దశాబ్దాలుగా ఈ భవనాలు సచివాలయం అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడుతున్నాయన్నారు. కొత్త భవనాలను నిర్మించాలంటే రూ.350 కోట్ల నిధులు కావాలన్నారు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించిన అంశంలో అగ్నిమాపక నిబంధనలకు లోబడి సచివాలయ భవనాలు లేవని పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - ఇటీవలి కాలం వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇదే సచివాలయం కేంద్రంగా పనిచేశారన్నారు. వారికి జడ్ ప్లస్ భద్రత కూడా ఉందని ఉత్తమ్ గుర్తు చేశారు. గతంలో ఎన్టీరామారావు, చంద్రబాబునాయుడు - వైఎస్ రాజశేఖరరెడ్డి - రోశయ్య - కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఇదే సచివాలయం నుంచి బాధ్యతలను నిర్వహించారన్నారు. ఏపీ ప్రభుత్వం ఇక్కడ సచివాలయాన్ని అమరావతికి తరలించడంతో ఎక్కువ వసతి సదుపాయాలు తెలంగాణకు సమకూరనున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయాన్ని బయటకు తరలించడం సరైన నిర్ణయం కాదన్నారు. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖలను ఇప్పుడున్న సచివాలయంలోకి మార్చవచ్చని దీనివల్ల ప్రజలపై భారం పడదన్నారు. రైతులకు రుణమాఫీ నిధులు విడుదల చేయలేదు, విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు ఇవ్వలేదు. సంక్షేమ రంగాన్ని విస్మరించి అనవసరంగా భవనాల నిర్మాణానికి నిధులు ఖర్చుపెట్టడం మంచి పద్ధతి కాదని ఉత్తమ్ తప్పుపట్టారు. కేసీఆర్ రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించాలన్నారు. విపక్షాలు, తెలంగాణ సమాజం, ప్రజా సంఘాల మనోభావాలను గౌరవించాలన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/