Begin typing your search above and press return to search.
కేసీఆర్ మౌనం వెనుక కారణం ఏంటి?
By: Tupaki Desk | 24 Nov 2016 7:08 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సీఎం కేసీఆర్ అంతకుముందు స్థాయి ఆవేశంతో కాదు కదా కనీసం నామమాత్రంగానైనా మీడియాతో కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తన బ్లాక్ మనీని ఎలా మార్చుకోవాలో అర్థం కాక గవర్నర్ వద్దకు, ప్రధాని వద్దకు కేసీఆర్ పరుగెత్తారని ఆరోపించారు. ప్రధానితో ఏమి మాట్లాడారో ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచి పెట్టారని ఉత్తమ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే వాస్తు పేరిట ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయానికి 40 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఉత్తమ్ విమర్శించారు.
పార్టీ ముఖ్యనేతలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నగరానికి వచ్చిన అనంతరం గాంధీభవన్ లో పార్టీ ఆఫీసు బేరర్లు - జిల్లా అధ్యక్షులు - ఇతర ముఖ్యులతో సమావేశమై చర్చించారు. సమావేశానంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేసి 15 రోజులైనా పేద ప్రజల కష్టాలు తీరలేదని అన్నారు. ప్రధాని అనాలోచిత - లోపభూయిష్టమైన నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని విమర్శించారు. రైతులు - పేదలు అన్ని పనులు వదులుకుని గంటల తరబడి బ్యాంకుల వద్ద నిలబడాల్సి వస్తున్నదని అన్నారు. నల్లధనం నిరోధించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారని, ఇప్పటి వరకు ఎంతమందిని పట్టుకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాంకులు - ఎటిఎంల వద్ద క్యూలలో నిలుచున్నవారికి మంచినీరు - ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. పెద్ద నోట్ల రద్దుపై తాము ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 28న ఆక్రోస్ దివస్ గా నిర్వహించాలని ఎఐసిసి పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/