Begin typing your search above and press return to search.

ఇలాంటి దానికి అసెంబ్లీ ఎందుకు...

By:  Tupaki Desk   |   27 Oct 2017 1:56 PM GMT
ఇలాంటి దానికి అసెంబ్లీ ఎందుకు...
X
తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు సాగుతున్న తీరుపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్ర‌స్ పార్టీ పెద‌వి విరిచింది. పేరుకే అసెంబ్లీ స‌మావేశాల‌ని పేర్కొంటూ టీఆర్ఎస్ పార్టీ సోలో షోగా మారిపోయింద‌ని మండిప‌డింది. అసెంబ్లీ సోమ‌వారానికి వాయిదా ప‌డిన అనంత‌రం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొలువుల కొట్లాట‌కు తాము శ్రీ‌కారం చుట్టిన త‌ర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రైతుల్ని అరెస్ట్ చేయడం బాధాకరమ‌న్నారు. స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించే క్ర‌మంలో శాసనసభ జరిగిన తీరు దురదృష్టకరమ‌ని పేర్కొన్నారు. ఇలాంటి ఏకపక్ష సమావేశాలు అసెంబ్లీలో జరిగితే ఏంటి టీఆర్ఎస్ భవన్ లో జరిగితే ఏంటని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్ర‌శ్నించారు.

ఆంధ్ర కాంట్రాక్టర్లకి 10వేలు విడుదల చేసిన ప్రభుత్వం... రైతులకి ఇస్తా అని హామీ ఇచ్చిన వడ్డీని చెల్లించకపోవడంలో ఆంతర్యమేంటని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌శ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే లను పోలీస్ స్టేషన్ లో బంధించి అసెంబ్లీలో బీజేపీ నిర్వహించుకోవడానికి సిగ్గుండాలని ఉత్త‌మ్‌ మండిప‌డ్డారు. రైతులకి న్యాయం జరిగేవరకు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పోరాటం చేస్తుంద‌ని తెలిపారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్రమార్క మాట్లాడుతూ శాసనసభ చరిత్రలో గంటన్నర పాటు మైకు అడిగితే ఇవ్వని చరిత్ర నేడు ఎదురవ్వడం దురదృష్టకరమ‌ని మండిప‌డ్డారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోవడంతో అసెంబ్లీ బయట రోడ్ పై బైటాయించామ‌ని భ‌ట్టి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖునీ చేసిందని...ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఇంటా.. బయటా.. పోరాడుతామ‌ని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 2-3 సంవత్సరాల నుండి రైతుల యొక్క పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉందిని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒక్కపక్క అతివృష్టి, మరోపక్క అనావృష్టితో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తాము పదేపదే కోరుతున్నామ‌న తెలిపారు. రాష్ట్రం ఏర్పడ ముందు...ఆ తర్వాత టీఆరెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని...ఆ హామీలను తాము గుర్తు చేస్తున్నామ‌ని వివ‌రించారు. మూడు సంవత్సరాలా నుండి పడుతున్న ఇబ్బందులను చూస్తూ తాము ఉద్యమాలు చేస్తున్నామ‌ని వివ‌రించారు. అసెంబ్లీలో రైతులకు సంబంధించిన సమస్యలను, గిట్టుబాటు ధరలను పెంచేందుకు తాము బీఏసీ సమావేశంలో ప్రజల పక్షణ డిమాండ్ చేశాం, విజ్ఞప్తి చేశామ‌ని వివ‌రించారు. సభలో రైతాంగ సమస్యల పట్ల మాట్లాడాలి అని తాము అనుకున్నామ‌ని అయితే అది ఆచ‌ర‌ణ సాధ్యం కాలేద‌ని తెలిపారు.