Begin typing your search above and press return to search.
ఉత్తమ్ నోటి వెంట టీ న్యూస్.. ఆంధ్రజ్యోతి
By: Tupaki Desk | 26 Jun 2015 4:43 AM GMTతమ దాకా వస్తే కానీ తత్వం బోధ పడదా? అన్న విషయాన్ని సూటిగానే అడిగేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఏపీ సర్కారు టీ న్యూస్‌కి నోటీసులు ఇవ్వటాన్ని రాజ్యాంగానికే విఘాతం కలిగించినట్లుగా తెలంగాణ అధికారపక్షం అభివర్ణించటాన్ని తప్పు పట్టిన ఆయన.. గతాన్ని వారికి గుర్తు చేసే ప్రయత్నం చేశారు.
టీఆర్‌ఎస్ సర్కారు పవర్‌లోకి వచ్చిన కాసిన్ని రోజులకే ఆంధ్రజ్యోతి ఛానల్‌ను నిషేధించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. ఆంధ్రజ్యోతి ఛానల్‌పై నిషేధాన్ని విధించటంపై మాట్లాడని వారు టీ న్యూస్‌కి నోటీసులు ఇస్తేనే గగ్గోలు పెట్టటం ప్రారంభించారంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రజ్యోతి ఛానల్‌పై నిషేధం విధిస్తే ఎలాంటి స్పందన లేని వారు.. టీ న్యూస్ విషయంలో అందుకు భిన్నంగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు.
తెలంగాణ సర్కారు తన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు మీడియాను నిషేధిస్తోందని.. ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తుందన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కేసీఆర్‌ది ప్రజావ్యతిరేక పాలనగా విమర్శించారు. టీ న్యూస్.. ఆంధ్రజ్యోతిలను కాసేపు పక్కన పెడితే.. ఉత్తమ్ మాటలు ఏపీ సర్కారు చర్యల్ని సమర్థించినట్లు లేదు..?