Begin typing your search above and press return to search.
దానం తోక సగానికి తెగిపోయింది
By: Tupaki Desk | 30 Dec 2015 10:34 AM GMTమాజీ మంత్రి దానం నాగేందర్ ఎన్ని పిల్లి మొగ్గలేస్తున్నా గ్రేటర్ కాంగ్రెస్ లో ఇంకా ఆయనే మొనగాడన్నట్లుగా ఉండేది... కొద్దికాలంగా రంగారెడ్డి - మెదక్ జిల్లాల నేతలు స్వరం పెంచడంతో చిన్నచిన్న ఘర్షణలు జరిగేవి. రీసెంటుగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉప్పల్ లో జరిగిన వేడుకల్లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు దానంను తరిమితరిమి కొట్టడంతో మొట్టమొదటిసారి ఆయనకు తీవ్ర పరాభవం ఎదురైంది. అంతేకాదు... దానం తోక కట్ చేయకపోతే పార్టీకి నష్టమని పీసీసీ అనుకునే స్థాయికి వెళ్లింది. ఆ కారణంగానే తాజాగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దానం నాగేందర్ తోకను సగానికి కోసేశారు.
గ్రేటర్ హైదరాబాద్ లో డివిజన్ల పంచాయతీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రెండు జిల్లాలనేతలతో సమావేశమైన ఉత్తమ్ రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే 64 డివిజన్లను ఆ జిల్లా నేతలకు , హైదరాబాద్ పరిధిలోకి వచ్చే 76డివిజన్లను దానంకు అప్పగిస్తున్నట్లు తెలిపారు..అధిష్టానంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. ఎవరి పరిధిలో వారు పనిచేస్తూ గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. సమిష్టిగా పోరాడుతే కాంగ్రెస్ దే విజయమని వ్యాఖ్యానించారు..ఈ పంచాయతీ గతం నుంచీ వస్తుందే .. నేటితో అది ముగిసినట్లు ప్రకటించినా నాయకులు తర్వాత ఎలా స్పందిస్తారో చూడాలి..