Begin typing your search above and press return to search.
సీనియర్లకు ఉత్తమ్ షాక్.. కాంగ్రెస్ లో అంతేగా?
By: Tupaki Desk | 7 Feb 2020 9:27 AM GMTకాంగ్రెస్ అంటే ఒక మహాసముద్రం.. అన్ని కాలువలూ సంద్రంలో చేరినట్టే అందరు నేతలు వచ్చి అందులో కలిసిపోవాల్సిందే.. దేశంలోని ఏ పార్టీలో లేనంత స్వేచ్ఛ , స్వాతంత్ర్యం కాంగ్రెస్ లో ఉంటుందట.. అందుకే ఆ పార్టీలో నేతలు కొట్టుకుంటారు.. తిట్టుకుంటారు.. సొంత పార్టీని తిడుతారు.. ఓడిస్తారు కూడా.. కానీ ఎక్కడా చర్యలు ఉండవు. అంతటి ప్రజాస్వామ్యపు లక్షణాలున్న కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరినీ ఎవ్వరూ ఖాతరు చేయరన్న విమర్శలున్నాయి.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తీరును సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాల కడిగేశారు. వరుస ఎన్నికల్లో ఓటములతో ఉత్తమ్ అన్ ఫిట్ దిగిపోవాలంటూ విమర్శించారు. అయినా వారిపై చర్యలు లేవు. మున్సిపల్ సన్నాహక సమావేశాన్ని రచ్చ చేసిన కాంగ్రెస్ నేతలు కలిసి సాగలేక ఆ ఎన్నికల్లో బొక్క బోర్లాపడ్డారు. అందుకే ఇప్పుడు ఉత్తమ్ రూటు మార్చాడు.
తనను వ్యతిరేకిస్తున్న నేతలందరికీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకిచ్చారు. తాజాగా తెలంగాణ లో జరగబోయే సహకార ఎన్నికల సన్నాహక సమావేశానికి సీనియర్లను దూరం పెట్టారు. వారిని పిలవకుండా తనకు మద్దతు దారులైన నేతలనే పిలిచి ఎలా గెలవాలనే దానిపై చర్చించారు.
శరామామూలుగానే ఉత్తమ్ ఇంట్లో జరిగిన ఈ కీలక సమావేశంపై సీనియర్లు భగ్గుమన్నారు. వర్గ విభేదాలు మళ్లీ రాజుకున్నారు. ఉత్తమ్ పై నేతలు ఫైర్ అయ్యారు. తమను ఎందుకు ఈ సమావేశానికి పిలవలేదని సీనియర్లు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.
కాగా సీనియర్లను పిలిస్తే మళ్లీ సమావేశం రసాభాసగా మారుస్తారని.. అందుకే పిలవకుండా ఉత్తమ్ సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇలా ఎన్నికల్లో గెలుపుకోసం ఆలోచించకుండా కాంగ్రెస్ నేతలు ఇంకా ఆధిపత్యం, అలకలు, బుజ్జగింపులతో కాలం గడుపుతూ కత్తులు లేకుండా కార్యక్షేత్రం లో దిగి పోతున్నారు. ఎన్నికల్లో పోరాడకుండా అధికార టీఆర్ఎస్ గెలుపునకు పరోక్షంగా దోహదపడుతున్నారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.