Begin typing your search above and press return to search.
తుడిచిపెట్టుకుపోయే ప్రమాదంలో కాంగ్రెస్
By: Tupaki Desk | 11 Jan 2019 6:54 AM GMTఅయ్యిందేదో అయిపోయింది... ఓటమిపై సమీక్ష చేసుకొని మళ్లీ పునరుత్తేజం పొంది వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాల్సిన కాంగ్రెస్ నాయకులు ఇంకా సిగపట్లు వీడడం లేదు. ఓటమికి కారణం నువ్వంటే నువ్వు అంటూ దెబ్బలాడుకోవడం పార్టీని మరింత కృంగ దీస్తోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ పై అవినీతి ఆరోపణలు రావడం.. ఆయన మనస్థాపంతో కాంగ్రెస్ కాడి వదిలి యూరప్ వెళ్లిపోవడం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. పీసీసీ చీఫే లేకపోవడంతో పంచాయతీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే వారే కరువయ్యారు. కాంగ్రెస్ ఓడిపోయిన ఎమ్మెల్యేలు అవమాన భారంతో గ్రామాలకు వెళ్లడం లేదు. లీడ్ చేయాల్సిన కాంగ్రెస్ పెద్దలు ఎవరి దారి వారు చూసుకొని కలహించుకుంటున్నారు. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తూ గంపగుత్తగా టీఆర్ ఎస్ తన ఖాతాల్లో వేసుకుంటోంది.
గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణలో హోరాహోరీగా సాగుతున్నాయి. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు దగ్గరుండి పంచాయతీ గ్రామాలకు సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేస్తూ అసమ్మతి లేకుండా పార్టీ ఫండ్ ఇస్తూ వారిని గెలిచేలా వ్యూహ రచన చేస్తున్నారు. కాంగ్రెస్ క్షేత్ర నాయకులకు ఆ సపోర్టు కరువైంది. ఎమ్మెల్యేలే ఓడిపోయారు తామెంత అని కింది స్థాయి నేతలు గ్రామాల్లో పోటీచేయకుండా ఖర్చు పెట్టకుండా మిన్నకుండిపోతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పంచాయతీల్లో తుడిచిపెట్టుకుపోయే ప్రమాదంలో పడిపోయింది.
పీసీసీ చీఫ్ యూరప్ వెళ్లిపోవడం.. ఆయనపై కాంగ్రెస్ సీనియర్లు అసమ్మతి గళం వినిపించడం.. ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో గ్రామ పంచాయతీలన్నీ టీఆర్ ఎస్ వశమవుతున్నాయి. పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు కాంగ్రెస్ సీనియర్లు పెద్ద పీట వేస్తున్నారని కిందిస్థాయి నేతలు వాపోతున్నారు. పార్టీని నడిపించే విధానం ఇది కాదని వారు అభిప్రాయపడుతున్నారు.