Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో కలకలం.. బాధపడ్డ ఉత్తమ్
By: Tupaki Desk | 26 Dec 2019 11:43 AM GMTమున్సిపల్ ఎన్నికల గురించి గాంధీభవన్ లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం రసాభాసాగా మారింది. సమావేశాన్ని ముందే కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు బహిష్కరించారు. కాంగ్రెస్ కోర్ కమిటీనికి సంబంధం లేని వారిని పిలిచారని బహిష్కరించిన వీహెచ్ తీరుతో కలత చెందిన ముఖ్య నేతలు షాకయ్యారు.
కోర్ కమిటీ సమావేశంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు కెక్కి పోరాడుతున్న తనపై టీఆర్ ఎస్ నేతలు మాటల దాడి చేస్తుంటే స్పందించరా అని ఉత్తమ్ కాంగ్రెస్ నేతలను నిలదీసినట్టు తెలిసింది. కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులను ఉత్తమ్ నిలదీసినట్టు తెలిసింది.
దీనికి కౌంటర్ ఇచ్చిన సీనియర్ నేత షబ్బీర్ అలీ ఏకంగా పీసీసీ ఉత్తమ్ తీరును ఎండగట్టినట్టు తెలిసింది.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ బీసీలు - రెడ్లుగా చీలిపోయిందని ఉత్తమ్ ఆధిప్యతాన్ని ప్రశ్నించినట్టు తెలిసింది.
కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఇన్నేళ్లలో ఉత్తమ్ ఇలా ఆవేదన ఎప్పుడూ చెందలేదని.. అందరినీ కలుపుకొని పోయే ఉత్తమ్ తొలిసారిగా తన ఆవేదనను - ఆందోళనను బయటపెట్టారని నేతలు చెబుతున్నారు. ఉత్తమ్ ఆవేదన ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ వారి అసహాయతను ఎత్తి చూపుతోంది.