Begin typing your search above and press return to search.
ఆ రహస్యం చెప్పేసిన బండ్ల గణేష్
By: Tupaki Desk | 25 Nov 2018 9:20 AM GMTతెలంగాణలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలకు ఇంకో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ప్రధాన పార్టీలు ఉద్ధృతంగా ప్రచారం నిర్వహిస్తూ దూసుకెళ్తున్నాయి. అధికార తెరాస పార్టీని ఢీకొట్టడానికి ప్రజా కూటమి పేరుతో కాంగ్రెస్.. తెలుగుదేశం కూడా జత కట్టాయి. ఐతే ఆ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. నాయకత్వ సమస్య కూటమికి పెద్ద ఇబ్బందినే తెచ్చి పెడుతోంది. కూటమి గెలిస్తే సీఎం ఎవరనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ విషయంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఎవరి పేరునూ ప్రొజెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ కూటమి గెలిస్తే కాంగ్రెస్ పార్టీ సీల్డ్ కవర్ రాజకీయం చూడొచ్చేమో. మరి ఆ సీల్డ్ కవర్లో ఎవరి పేరు ఉంటుందో ఇప్పుడే చెప్పలేం.
ఐతే ఇప్పటికైతే సీఎం ఎవరు అనే మాట ఎత్తకుండా మహాకూటమి నేతలు ప్రచారం సాగిస్తూ వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ కూటమి గెలిస్తే సీఎం ఎవరనే విషయాన్ని చూచాయిగా చెప్పేశాడు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరునే అతను తెరమీదికి తెచ్చాడు. ఉత్తమ్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సమయంలో బండ్ల ఈ మాట చెప్పాడు. ప్రచారంలో అతను మాట్లాడు9తూ.. ‘‘ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల హుజూర్ నగర్ నియోజకవర్గం అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. ఉత్తమ్ ఆశీస్సులతో ఈ నియోజకవర్గం భవిష్యత్తు అద్బుతంగా ఉంటుంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం పార్టీ నాయకురాలు, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. సోనియా తెలంగాణ ఇస్తే కేసీఆర్ ఇంటిల్లిపాదీ ఆమె ఇంటికి పోయి కాళ్లు మొక్కి ఫోటోలు తీసుకొని.. ఇప్పుడు మాత్రం ఆమె ఏం చేయలేదని.. కాంగ్రెస్ ఏం చేయలేదని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. ఆయన తెలంగాణ రాష్ట్రానికి సారథిగా మళ్లీ మీ వద్దకు తిరిగి వస్తాడు’’ అని బండ్ల అన్నాడు. సీఎం అనే మాట వాడలేదు కానీ.. రాష్ట్రానికి సారథి అనడం ద్వారా ఆయనే సీఎం అవుతారనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు బండ్ల.