Begin typing your search above and press return to search.
బహిరంగ లేఖతో కేసీఆర్ ను టార్గెట్
By: Tupaki Desk | 2 Oct 2017 12:34 PM GMTతెలంగాణలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం - విమర్శల పర్వం కొత్త రూపును సంతరించుకుంది. ఇప్పటివరకు సొంతంగా పార్టీలుగా సాగిన దూకుడు పర్వం సింగరేణి ఎన్నికల పుణ్యాన కూటమి కట్టిన సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా - టీడీపీ - సీపీఐ ఒక్కటతాటిపైకి వచ్చి టీఆర్ ఎస్ ను టార్గెట్ చేశాయి. ఈ పరిణామం విపక్షాలను ఆలోచనలో పడేసింది. మరోవైపు రైతు సమన్వయ సమితిల పేరుతో కేవలం టీఆర్ఎస్ నేతలకే బెర్తులు దక్కుతున్నాయని సైతం విమర్శలు చేస్తున్నాయి.
ఇలా విపక్షాల వేడిని తాజాగా పీసీసీ అధ్యక్షులు ఉత్తమకుమార్ రెడ్డి మరింతగా పెంచారు. అయితే షరామూములు విలేకరుల సమావేవః కాకుండా...ఏకంగా బహిరంగ లేఖ రాశారు. అక్టోబర్ 3 న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సత్యాగ్రహం నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులకు ఉత్తమ్ బహిరంగ లేఖ రాశారు. ``రైతు సమన్వయ సమితులు రద్దు కావాలి - గ్రామ పంచాయితీలు బలపడాలి`` అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనాలని కోరారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ సవివరింగా వివరించారు..```తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజ్జాలను కష్టాల సుడిగుండంలోకి నెడుతున్న విషయం మనకు తెలుసు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఏకపక్షంగా ముందుకు వెకెళుతున్నది. అన్ని స్థాయిలలో ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను అక్రమంగా తనలో కలుపుకుంటూ, ఇతర పార్టీల ఉనికి లేకుండా చేయాలని భావిస్తున్నది. ప్రజల అవసరాలకు నిధులు కేటాయించకుండా అనవసర కార్యక్రమాలతో నిధులను దుర్వినియోగం చేస్తున్నది. ప్రాజెక్టుల అంచనాలను విపరీతంగా పెంచేస్తూ అవినీతికి పాల్పడుతున్నది . తాజాగా తన నిరంకుశ చర్యలకు పరాకాష్టగా మరో అప్రజాస్వామిక చర్యకు పాల్పడింది. అదే జీవో 39.
రాజ్యాంగ విలువలకు, చట్టాలకు వ్యతిరేకంగా తెచ్చిన జీఓ ఇది. అక్టోబర్ 2న మనం మహాత్మా గాంధీ జయంతి జరుపుకోబోతున్నాం. మహాత్మ గాంధీ పదే పదే గ్రామ స్వరాజ్యం అవసరం గురించి మనకు చెప్పారు. ఆయన ఒచ్చిన స్ఫూర్తి తోనే మనం రాజ్యాంగం లో 73 - 74 రాజ్యాంగ సవరణలు చేసుకున్నాం. గ్రామ పంచాయితీ వ్యవస్థను ఒక క్రమ పద్ధతిలో తీర్చిదిద్దుకున్నాం. ప్రస్తుతం తెరాస ప్రభుత్వం కెసిఆర్ నాయకత్వం లో ఈ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా జీవో 39 తెచ్చింది. ఈ జీవో ఆధారంగా గ్రామ - మండల - జిల్లా - రాష్ట్ర స్థాయిలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమితులు ప్రాజాల తో ఎన్నకవుతున్నవి కాదు. అధికార పార్టీ మంత్రులు వారిని నామినేట్ చేస్తున్నారు. ఈ సమితులలో కేవలం తెరాస పార్టీ కార్యకర్తలను నింపుతున్నారు. ఆయా గ్రామాలలో - మండలాలలో - నియోజక వర్గాలలో ఇతర పార్టీల ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నా - వారికి సంభంధం లేకుండా - అధికార పార్టీ కార్యకర్తలనే ఏకపక్షంగా నింపుతున్నారు.`` అని వివరించారు.
``ఈ చర్యవల్ల గ్రామాలలో ఉండే సర్పంచులు - ఉప సర్పంచులు - వార్డు మెంబర్లు - ఎంపీటీసీ లు - జడ్పీటీసీ లు - మండలాధ్యక్షులు - జిల్లా పరిషత్ అధ్యక్షులు - నీటి వినియోగదారుల సంఘాల చైర్మన్లు - ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు - పాలక వర్గాల సభ్యుల పాత్ర నామమాత్రం కానుంది. వీరు కార్యక్రమాలు - బాధ్యతలు స్వేచ్ఛగా నిర్వర్తించకుండా ఈ రైతు సమన్వయ సమితులు అడ్డుకుంటాయి. భూమి రికార్డుల ప్రక్షాళన - అమ్మకాలు - కొనుగోళ్ల లో కూడా ఈ రైతు సమన్వయ సమితులు జోక్యం చేసుకుని ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తాయి. అవినీతికి పాల్పడతాయి. భూమి రికార్డులను చేతిలో పెట్టుకుని గ్రామీణ ప్రజలను - ఇతర పార్టీల - సంఘాల కార్యకర్తలను - వ్యక్తులను కూడా బెదిరించి లొంగ దీసుకోవడానికి పూనుకుంటాయి. ఒక రకంగా ఈ సమితులు ప్రజల హక్కులను హరించి, TRS పార్టీ కి గ్రామాలపై గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టడానికి పూనుకుంటాయి. ఈ ప్రభుత్వ నిరంకుశ చర్యలను మనం అడ్డుకోకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులలో కూరుకుపోతారు. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా - కార్యకర్తలుగా ప్రజల పక్షాన నిలబడడం మన బాధ్యత. ఈ బాధ్యత తోనే మనం ఇప్పటికే ఈ జీవో కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక కార్యక్రమాలు చేపట్టాం. సభలు జరిపాం. కానీ ప్రభుత్వం దుందుడుకుగా ముందుకు వెళుతోంది.
ఈ నేపథ్యంలో ప్రజల హక్కుల రక్షణ కోసం, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడం కోసం మనం ఇతర పార్టీలతో మనకున్న సైద్ధాంతిక, రాజకీయ విబేధాలను కూడా పక్కన బెట్టి బీజేపీ, టీడీపీ, సిపిఐ లాంటి ఇతర పార్టీలతో కలిసి ఈ జీవోకు వ్యతిరేకంగా కార్యక్రమాలలో పాల్గొంటున్నాం. ఇప్పటికే గవర్నర్ ను కల్సి మన వాదన వినిపించాం. ప్రభుత్వం మెడలు వంచి జీవో 39 ను ఉపసంహరించుకునేలా చేయడానికి అక్టోబర్ 3 న రాష్ట్ర వ్యాపితంగా సత్యాగ్రహానికి మనం పిలుపు ఇచ్చాము. ఈ కార్యక్త్రమంలో భాగంగా మన శ్రేణులు గ్రామాలలో జరిగే నిరసన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని కోరుతున్నాను. మండల కేంద్రాలలోజరిగే ధర్నా కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొబనాలని మిమ్మల్ని కోరుతున్నాను. ప్రతి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు/సభ్యురాలు - కార్యకర్తలు - నాయకులు - ప్రజా ప్రతినిధులు - కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు - సభ్యులు ప్రతి ఒక్కరూ సమర స్పూర్తితో ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలి. ప్రభుత్వo నిరంకుశ జీవో ను వెనక్కు తీసుకునేలా మన కార్యక్రమం విజయవంతం కావాలి.ప్రజల, ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలను - మేధావుల - నిపుణుల అభిప్రాయాలను లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం నిలువరించాలి. అందుకే ఈ కార్యక్రమం మనందరిదీ. మన బలాన్ని, శక్తి సామర్ధ్యాలను మనం వెలికి తీసి ప్రజల పక్షాన నిలబడాలి.`` అని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలో వివరించారు.