Begin typing your search above and press return to search.
ఉత్తమ్ సంచలనం...కాంగ్రెస్ లో కొత్త కలకలం
By: Tupaki Desk | 2 Jan 2020 5:25 PM GMTకాంగ్రెస్ పార్టీ అంటేనే...శృతిమించిన భావ ప్రకటన స్వేచ్ఛకు మారు పేరు అనే భావన రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉంటుంది. సందర్భం ఏదైనా తాము అనుకున్నది చెప్పేయాలని ఆ పార్టీ నేతలు అనుకుంటుంటారు. తాజాగా ఇప్పుడే అదే ఉద్దేశం కొత్త వివాదం ఇంకా చెప్పాలంటే...కులాల కుంపట్లను రాజేస్తోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజుల్లో పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ పోస్టు దక్కించుకునేందుకు సీనియారిటీ కంటే...కుల సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికలపై హుజూర్ నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన సందర్భంగా ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. పీసీసీ బాధ్యతలతో సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోతున్నందునే, రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు గత కొద్దికాలంగా త్వరలో పీసీసీ అధ్యక్షుడు మార్పు జరుగుతుందనే ప్రచారం కొనసాగుతుండగా...ఉత్తమ్ ఈ మాట చెప్పడంతో ఆశావహులు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు అదిష్టానం ప్రసన్నం కోసం ప్రయత్నిస్తూనే...మరోవైపు కుల సమీకరణాలు తెరపైకి తెస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్ష పదవికి పెద్ద ఎత్తున్నే నేతలు పోటీ పడుతున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇలా రెడ్డి నేతలు, బీసీ వర్గానికి చెందిన వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్ వంటి వారితోపాటు ఎస్సీ నేత - మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా పీసీసీ అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే, ఈ దఫా సామాజిక ప్రస్తావన తెస్తూ..పోస్టు ఆశిస్తున్నారట. కాంగ్రెస్‌లో ముఖ్య పదవుల్లో ప్రస్తుతం రెడ్డిల ఆదిపత్యం కొనసాగుతున్నందున బీసీలు లేదా ఎస్సీలకు పదవి ఇచ్చి సామాజిక న్యాయం అంశాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకోవాలని పేర్కొంటూ...ఆయా నేతలు తమకు పోస్ట్ దక్కేలా పైరవీ చేసుకుంటున్నారట. మరి ఢిల్లీ పెద్దలు వీరి ఎత్తుగడలను ఏ విధంగా స్వీకరిస్తారో వేచి చూడాల్సిందే.