Begin typing your search above and press return to search.
తెలంగాణ కాంగ్రెస్ కు రాజస్థాన్ ఫార్ములా!
By: Tupaki Desk | 31 Aug 2018 5:34 AM GMTతెలంగాణ కాంగ్రెస్ లో మధనం మొదలైంది. ముందస్తుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వం అలెర్ట్ అయ్యింది. ఓ పక్క తెలంగాణ అధికారపక్షం తిరుగులేని అధిక్యతతో దూసుకెళుతుండగా..ఆ పరుగు పందెంలో తామిక వెనుక పడకూడదన్నట్లుగా కాంగ్రెస్ అధినాయకత్వం ఉందన్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇందులో భాగంగా తెలంగాణ రథసారధి ఉత్తమ్ ను ఢిల్లీకి పిలిపించుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తెలంగాణలో ముందస్తు వస్తే ఏం చేయాలి? అన్న విషయంపై లోతుగా చర్చించాల్సి ఉంది. అయితే.. వేరే కారణాల వల్ల ఉత్తమ్ తో రాహుల్ భేటీ కాలేదు. అయితే.. ఆయనకు బదులుగా పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ముందస్తు ఓకే అయితే.. పార్టీ ఎన్నికల ప్రణాళిక ఏం ఉండాలి? అభ్యర్థుల ఎంపికతో పాటు.. పొత్తుల లెక్కల మాటేమిటి? అన్న అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ముందస్తు కానీ వస్తే టీఆర్ ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు వీలుగా ఏమేం చేయాలన్న అంశంపై సుదీర్ఘంగా సమావేశం సాగినట్లుగా చెబుతున్నారు. ఇందుకోసం రాజస్థాన్ ఫార్ములాను అమలు చేస్తే మంచిదన్న మాట సమావేశంలో వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపే ఫార్ములాను రూపొందించారు. తెలంగాణలోనూ అదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
అంతేకాదు.. టీఆర్ ఎస్ ను బలంగా ఢీ కొట్టేందుకు వీలుగా పొత్తుల అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకోవటానికి పార్టీ సిద్ధంగా ఉందన్న సంకేతాల్ని పంపారు. పార్టీ రాష్ట్రంలో ఎన్ని స్థానాల్లో బలంగా ఉంది? పొత్తులు పెట్టుకుంటే ఎక్కడెక్కడ పెట్టుకోవాలి? అన్న అంశంపైన చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఎన్ని స్థానాలు సదరు పార్టీలకు ఇవ్వాలన్న అంశంపైనా కీలక చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి కొన్ని నిర్ణయాల్ని తీసుకున్నారని.. వాటిని అసెంబ్లీ రద్దు తర్వాతే బయటకు చెప్పాలన్న నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ ముఖ్యనేతలతో చర్చలు జరిపిన అనంతరం ఉత్తమ్ మాటల్లోఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపించిందన్న మాట కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. మరి.. ఈ ఆత్మవిశ్వాసం ఎంతకాలం ఉంటుందో చూడాలి?