Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో కొత్త కొట్లాట..పట్టని ఉత్తమ్
By: Tupaki Desk | 24 Sep 2019 9:58 AM GMTకాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ వైదొలగానికి ప్రధాన కారణం సీనియర్లు. వాళ్లు గత ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చి వారసత్వ రాజకీయాలు ప్రోత్సహించడం.. పార్టీని పట్టించుకోకపోవడంతో పార్టీ ఓడిపోయిందని రాహుల్ ధ్వజమెత్తారు.. సీనియర్లు తప్పుకుంటేనే తాను కాంగ్రెస్ పగ్గాలు చేపడతానని రాహుల్ భీష్మించుకు కూర్చున్నారు. రాజస్థాన్ - మధ్యప్రదేశ్ సీఎంలు వారి కొడుకులు - అల్లుల్ల కోసం ప్రచారం చేసి పార్టీని గాలికి వదిలేసిన తీరును రాహుల్ తప్పుపట్టారు.
ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల ముందర రాహుల్ గాంధీ అధ్యక్షుడి హోదాలో ఒక నిబంధన పెట్టారు. అది ‘ఒక కుటుంబానికి ఒక సీటు మాత్రమే’. దీన్ని అందరు నేతలకు అప్లై చేశారు. తెలంగాణలో సబితాకు మాత్రమే టికెట్ ఇచ్చి ఆమె కుమారుడికి ఇవ్వలేదు. ఇక సీనియర్ జానారెడ్డికి ఇచ్చి ఆయన కుమారుడికి ఇవ్వలేదు. కానీ ఈ నిబంధనను కొందరు సీనియర్లు ఉల్లంఘించారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ సీఎంలతోపాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఉల్లంఘించి తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చారు.
ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి..ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీచేశారు. ఉత్తమ్ గెలవగా.. పద్మావతి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ నల్గొండ ఎంపీగా పోటీచేశారు. ఆ టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డిని కాదని ఉత్తమ్ నిలబడ్డాడు. ఆ సమయంలోనే పటేల్ కు తాను గెలిస్తే హుజూర్ నగర్ సీటును ఇస్తానని ఉత్తమ్ మాట ఇచ్చాడట..
తాజాగా ఉత్తమ్ పీసీసీ చీఫ్ హోదాలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తన భార్యను నిలబెడుతుండడం వివాదాస్పదమవుతోంది. రాహుల్ గాంధీ చెప్పిన ఒక ఫ్యామిలీకి ఒక సీటును నిబంధనను ఇక్కడ అప్లై చేయాలని రేవంత్ లాంటి నేతలు మొత్తుకుంటున్నా టీకాంగ్రెస్ సీనియర్లు అంతా ఉత్తమ్ కే సపోర్టు చేస్తున్నారు. ఇక నల్గొండ ఎంపీ సీటును త్యాగం చేసిన పటేల్ రమేష్ రెడ్డి సైతం ఉత్తమ్ తనకు సీటు ఇవ్వకుండా ఆయన భార్య పద్మావతిని దించడంపై గుర్రుగా ఉన్నారు.
ఇలా కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేతిలో పెట్టుకున్న ఉత్తమ్.. ‘ఒక ఫ్యామిలీకి ఒక సీటు ’ అన్న రాహుల్ నిబంధనను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. ఇక హామీ ఇచ్చి సీటు ఇస్తానన్న పటేల్ రమేష్ రెడ్డిని సైతం కాలదన్నడం కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది. హుజూర్ నగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త కొట్లాటకు దారితీస్తోంది.రాహుల్ గాంధీ ఆదేశాలనే పట్టించుకోని వైనం కలకలం రేపుతోంది.