Begin typing your search above and press return to search.
ఉత్తమ్ సాబ్..ఇంత లేటయితే ఎలా?
By: Tupaki Desk | 6 Jan 2016 6:59 AM GMTగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో రకరకాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినప్పటకీ స్వరాష్ర్టంలోనే గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రేటర్ లో జెండా ఎగురవేసి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి టీపీసీసీ కొత్త పంథా ఎన్నుకుంది.
హైదరాబాద్ నగరంలో 90 శాతం మంది ఓటర్లు స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నట్టు గుర్తించిన ఆ పార్టీ...నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్దిని దృశ్య రూపంలో ఓటర్లకు చేర వేయాలని నిర్ణయించింది. సంప్రదాయ ఎన్నికల ప్రచారం చేయడంతోపాటు సోషల్ మీడియాలోనూ ప్రచారాన్ని నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది. అందుకు ప్రత్యేకంగా గాంధీభవన్ లో సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పలు అభివృద్ది కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి హైటెక్ ఓటర్లను ఆకట్టుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ నేతలు సోషల్ మీడియాలో పార్టీ ప్రచారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న అధికార టీఆర్ ఎస్ నిజస్వరూపాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నామని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...అక్రమంగా సంపాదించిన సొమ్ములతో హైదరాబాద్ నిండా ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యపద్దతిలో ప్రచారం చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం దొంగచాటుగా మున్సిపల్ చట్టంలో సవరణలు చేసిందని, ఇది ప్రజాస్వామ్య విరుద్దమని ఆయన మండిపడ్డారు. అయితే ఇప్పటికే టీఆర్ ఎస్ - టీడీపీ-బీజేపీ కూటమి సోషల్ మీడియా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇపుడు బుడిబుడి అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సమయానికి టార్గెట్ ను చేరుకోగలుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.