Begin typing your search above and press return to search.
ఉత్తమ్ కుమార్ గర్జన ఉత్తదేనా..?
By: Tupaki Desk | 2 Aug 2016 11:27 AM GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు గర్జన జరిగే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఏ ముహూర్తాన కాంగ్రెస్ పార్టీ దాన్ని తలపెట్టిందో కానీ వాయిదాలు పడుతూనే ఉంది. తెలంగాణలో రైతుల సమస్యలు - సాగునీటి సమస్యలపై ప్రభుత్వ తీరుపై టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమరశంఖం పూరించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కరువు - సాగునీరు తదితర రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతు గర్జన పేరుతో భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం చేశారు... సీనియర్లను ఏకతాటిపైకి తెచ్చారు. దాంతో సీనియర్లంతా కలిసి జనసమీకరణ - సభ ఏర్పాట్లు కూడా పరిశీలించారు. ఈలోగా మల్లన్నసాగర్ భూసేకరణ అంశం తెరపైకి రావడంతో రైతు గర్జనను పక్కన బెట్టారు. ఈలోపు వర్షాలు వచ్చి ప్రాజెక్టులు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. అయినా సరే.. రైతు గర్జన నిర్వహించేందుకే ఉత్తమ్ ఏర్పాటు చేశారు. కానీ.. మరోసారి అవాంతరం ఎదురైంది.
ఈసారి పూర్వపు సమస్యలతోపాటు అదనంగా భూ నిర్వాసితులకు 2014 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్న డిమాండ్ తో రైతు గర్జన నిర్వహించాలని అనుకున్నారు. కానీ, రెండోసారీ కాంగ్రెస్ పార్టీకి నిరాశే ఎదురైంది. ఈసారి ఆయనకు డెంగీ జ్వరం రావడంతో రైతుగర్జన సభ మరోసారి వాయిదా పడింది. దీంతో ఇప్పటికే రెండు - మూడుసార్లు వాయిదా పడ్డ రైతు గర్జన అసలు జరుగుతుందా? లేదా అన్న అనుమానం కాంగ్రెస్ నాయకుల్లో తలెత్తుతోంది.
సభ నిర్వహణకు పోలీసుల నుంచి అనుమతులు కూడా తీసుకున్న కాంగ్రెస్ నేతలు రైతు గర్జన జరుగుతుందా? లేదా అన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. వాస్తవానికి అనైక్యతతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఒక్కటి చేయడానికి అధిష్టానం ఆదేశాల మేరకు రైతు గర్జనకు ప్లాన్ చేశారు ఉత్తమ్. అధిష్ఠానం కూడా సీరియస్ గా ఉందన్న విషయం గుర్తించి సీనియర్లంతా కూడా కలిసొచ్చారు. దీంతో గర్జన హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ఏదో ఒక కారణంతో మళ్లీమళ్లీ వాయిదా పడుతుండడంతో కాంగ్రెస్ శ్రేణులు నీరసపడుతున్నాయి. టీఆరెస్ నాయకత్వం ఇది చూసి చిద్విలాసంగా నవ్వుతోంది.