Begin typing your search above and press return to search.
కేసీఆర్ ను ఎదుర్కునేందుకు ఉత్తమ్ ఎత్తుగడ
By: Tupaki Desk | 26 Jan 2018 7:22 AM GMTసుదీర్ఘకాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం ప్రకటించినప్పటికీ సీఎం పదవి కోసం నాయకుల మధ్య పోటీ - అనైక్యత కారణంగానే కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ఓడిపోయిందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఆ తరువాత కూడా నాయకులు ఎవరికి వారే అనే రీతిలో వ్యవహరించడం కాంగ్రెస్ గ్రాఫ్ ను అమాంతం పడేసింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యత సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. తామంతా ఒక్కటేనని ప్రజలకు చాటడంతో పాటు, కాంగ్రెస్ శ్రేణులకు విశ్వాసం కల్పించేందుకు చర్యలు జోరందుకున్నాయి. ఫిబ్రవరి మూడవ వారం నుండి నాయకులందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికి సన్నాహకంగా తొలుత నాయకులను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు అంతర్గతంగా తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి.
పీసీసీ రథసారథిగా రెండో సారి ఎన్నికైన ఉత్తమ్ ఇటు పార్టీ బలోపేతం అటు నేత మధ్య ఐక్యత కోసం చెమట ఓడుస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 28న కాంగ్రెస్ సీనియర్ నాయకుల విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి నివాసం ఇందుకు వేదిక కానుంది.నాయకుల అహం - ఆధిపత్య సమస్యలను పక్కనబెట్టి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు, ఎక్కువ ఎంపీ స్థానాలను గెలిపించుకోవాలనే లక్షంతో పనిచేయాలనేది ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం. ఈ విందుకు ఆహ్వానించేందుకు 300 మందితో కూడిన జాబితాను ఇప్పటికే రూపొందించారు. టీపీసీసీ నాయత్వంతో పాటు - ముఖ్య నాయకులు - పీసీసీ మాజీ అధ్యక్షులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - రాష్ట్ర - కేంద్ర మాజీ మంత్రులు - మాజీ ఎమ్మెల్యేలు - మాజీ ఎమ్మెల్సీలు - మాజీ ఎంపీలు - ఏఐసీసీలో వివిధ పదవుల్లో ఉన్న - గతంలో ఉన్న నాయకులను విందుకు ఆహ్వానించాలని నిర్ణయించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారల ఇన్ ఛార్జ్ డాక్టర్ ఆర్.సి.కుంతియాతో పాటు - ఏఐసీసీ నుండి ముఖ్య నాయకులను కూడా ఆహ్వానించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. నాయకుల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకు తొలి మెట్టుగా ఈ విందు సమావేశం ఉండనుందని కాంగ్రెస్ లో ఉన్నత స్థాయి నాయకులు చెబుతున్నారు.
సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత టిపిసిసి పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడ్డారు. వారిలో కోమటిరెడ్డి బ్రదర్స్ - డీకే.అరుణతో పాటు సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి - టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. అయితే, అధిష్టానం మిగతా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పాటు టీపీసీసీ ఛీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించేందుకు మొగ్గు చూపింది. దీంతో పాటు ఏడాదిలో ఎన్నికలు రానుండడంతో ఆయన నేతృత్వంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళనుందని సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవికోసం పోటీ పడినవారు, ఇతర సీనియర్ నాయకులు కాస్త ముభావంగా ఉన్నారు. తాము ఐక్యం కాకుండా రాజకీయ వ్యూహాల్లో దిట్ట అని పేరున్న సీఎం కేసీఆర్ ను ఓడించలేమనే భావన ఉన్నప్పటికీ, అందుకు ఉత్తమే చొరవ చూపాలనే భావన అందరిలో నెలకొంది. నాయకులతో ఉన్న గ్యాప్ ను తొలగించేందుకు ఉత్తమ్ సన్నిహితులు చొరవ చేసి ఈ విందు సమావేశానికి పూనుకున్నారు. దీనికి రాష్ట్ర పార్టీలో ముఖ్యులని భావించే ప్రతి ఒక్కరిని విడిచిపెట్టకుండా ఆహ్వానాలు పంపిస్తున్నారు. ఈ సందర్భంగా విబేధాల పరిష్కారానికి చొరవచూపుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీని తరువాత కూడా వ్యక్తిగతంగా నాయకులను కలవడంతో పాటు, వారి అభిప్రాయాలు స్వీకరించడం, వారితో ఏ అంశాల్లో విబేధాలు ఉన్నాయో, వాటిని పరిష్కరించే ఫార్ములాను ప్రతిపాదించడం చేస్తారని వారు పేర్కొంటున్నారు.