Begin typing your search above and press return to search.
ఉత్తమ్ ప్రశ్నకు టీ సర్కారు నీళ్లు నములుడేంది?
By: Tupaki Desk | 22 March 2016 5:56 AM GMTతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం కావటానికి ముందు.. ప్రారంభం అయ్యాక తెలంగాణ అధికారపక్షం ముందు విపక్షాలు చిన్నబోయాయి. ఇక.. బడ్జెట్ సందర్భంగా తెలంగాణ అధికారపక్షం చెప్పిన మాటలు విన్న వారికి తెలంగాణ రాష్ట్రం వెలిగిపోతుందని.. అభివృద్ధి విషయంలో దూసుకుపోవటమే కాదు.. వినూత్నంగా వ్యవహరిస్తోందని.. భారీగా వృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ఫీలింగ్ కలిగింది.
అయితే.. ఇదంతా విపక్షాలు నోరు విప్పనంత వరకే. బడ్జెట్ పై చర్చ షురూ అయిన నాటి నుంచి విపక్ష నేతలు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. వారు లేవనెత్తిన సందేహాలు విన్న వారికి కేసీఆర్ సర్కారు మాటల్లో నిజం ఎంతన్న సందేహం కలిగే పరిస్థితి. తమ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల విషయాన్నే తీసుకుంటే.. మరో వారంలో మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం పూర్తి అయ్యే నాటికి రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామని.. ఇందుకు అవసరమైన రుణాన్ని తీసుకురానున్నట్లు ఘనంగా చెప్పుకున్నారు.
ఇదే అంశంపై.. గతంలో గృహ నిర్మాణ శాఖను నిర్వహించిన అనుభవం ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం నీళ్లు నమిలే పరిస్థితి. ఇక.. గృహనిర్మాణ శాఖను చూసే మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన పరిస్థితి మహా ఇబ్బందికరంగా మారింది.
ఇక.. ఉత్తమ్ లేవనెత్తిన సందేహాల్లో ప్రధానమైంది.. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రూ.13,946 కోట్లు అయ్యే వ్యయంలో రూ.13,359 కోట్ల రుణం వస్తుందని చెప్పటాన్ని ప్రశ్నించారు. హడ్కో దేశం మొత్తానికి ఇచ్చే రుణ ప్రతిపాదనే రూ.22వేల కోట్లు అయితే.. అందులో రూ.13,500 కోట్లు మాత్రమే రుణంగా ఇస్తుందని.. అందులో మంత్రి వర్యులు రూ.13,359 కోట్లు తెలంగాణకు వస్తాయని చెబుతున్నారని.. ఇదెలా సాధ్యమవుతుందని సూటిగా ప్రశ్నించారు. ఇన్నేసి వేల కోట్లు హడ్కో నుంచి రుణంగా వస్తుందని చెబుతున్నా.. మొత్తంగా రూ.2500 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినా గొప్పేనని తేల్చారు. మరి.. రూ.2500 కోట్లతో రెండు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను ఎలా నిర్మిస్తారని నిలదీశారు. వేలాది కోట్లు వస్తున్నట్లుగా తెలంగాణ సర్కారు చెప్పే మాటలకు కౌంటర్ గా తెలంగాణ విపక్షాలు సంధిస్తున్న సందేహాలు చూస్తే.. కేసీఆర్ లెక్క ఎక్కడో మిస్ అయినట్లుగా అనిపించట్లేదు?