Begin typing your search above and press return to search.
ఇదే కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నది ఉత్తమ్
By: Tupaki Desk | 11 Oct 2018 4:07 AM GMTతెలంగాణ రాజకీయాలు మాంచి కాకమీదున్నాయి. తమలపాకుతో నువ్వు ఒకటంటే...తలుపు చెక్కతోనే రెండంటా...అన్న చందంగా ఆయా ప్రధాన పార్టీల నేతలు ఏమాత్రం తగ్గకుండా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు!.విమర్శలు - సవాళ్లు-ప్రతిసవాళ్లు వేసుకుంటున్నారు. ఈ జాబితాలోకి తాజాగా బహిరంగ లేఖలు చేరాయి. ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా ఎత్తులువేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి - గులాబీ దళపతి కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు వర్సెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్య లేఖల యుద్ధం జరుగుతోంది. ఉత్తమ్ కు హరీశ్ రావు 12 ప్రశ్నలతో లేఖ రాయగా...ఆ వెంటనే ఉత్తమ్ సైతం లేఖ రాశారు. తద్వారా కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ రథసారథిగా తాను ఎంత అలర్ట్ గా ఉన్నానో తెలియజెప్పే సందేశం పంపించారు.!
మహాకూటమి రూపంలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తును ప్రశ్నిస్తూ ఉత్తమ్‌కు హరీశ్ రావు లేఖరాసిన సంగతి తెలిసిందే. దీనికి వెంటనే ఉత్తమ్ రిప్లై ఇచ్చారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. హరీశ్ రావుకు ధన్యవాదాలు అంటూ ఎత్తిపొడిచిన ఉత్తమ్ ఆయన సంధించిన 12 ప్రశ్నల్లో ఒక్కటి కూడా తెలంగాణ సమాజానికి పనికివచ్చేవి కావని ఎద్దేవా చేశారు. 2009లో తెలంగాణకు టీడీపీ అనుకూలంగా లేఖ ఇచ్చినందుకే పొత్తుపెట్టుకున్నామని వారు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణకు వ్యతిరేక పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. `గతంలో తెలంగాణకు బద్ద వ్యతిరేకయిన సీపీఎంతో పొత్తు పెట్టుకునేటప్పుడు టీఆర్ ఎస్ నాయకులకు శరం లేదా. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు గురించి ప్రశ్నించే నైతికతే ఆ పార్టీకి లేదు. బీజీపీతో టీఆర్ ఎస్ అంటకాగుతోంది` అంటూ ఉత్తమ్ విరుచుకుపడ్డారు.
ప్రత్యేక రాష్ట్రం తమ వల్లే వచ్చిందని గొప్పలు చెప్పుకునే టీఆర్ ఎస్ పార్టీ ఏడు మండలాలు గురించి ఎందుకు పోరాటం చేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విభజన హామీల సంగతి ఏమైందని ఆయన నిలదీశారు. టీఆర్ ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో వందసీట్లు దక్కడం అనే కల చెదిరిందని, ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావాల్సిందేనని జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని చెప్పకనే చెప్పిన హరీష్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఉత్తమ్ అన్నారు.