Begin typing your search above and press return to search.
అమిత్ షాతో టచ్ లో ఉన్న ఆ 20 మంది ఎవరు?
By: Tupaki Desk | 18 May 2017 10:12 AM GMTతెలంగాణ కాంగ్రెస్ లో అమిత్ షా రచ్చ మొదలైంది. త్వరలో ఆయన తెలంగాణలో పర్యటించనుండడం... కాంగ్రెస్ అంతోఇంతో బలంగా ఉన్న నల్గొండ జిల్లాలోనూ ఆయన పర్యటన ఉండడంతో ఉన్న కొద్ది మంది నేతలూ జారిపోతారేమోనన్న భయం ఆ పార్టీలో కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడే స్వయంగా 20 మంది పేర్లతో అధిష్టానానికి ఒక జాబితా ఇచ్చారని.. వారంతా అమిత్ షాతో టచ్ లో ఉన్న నేతలని అంటున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా అడుగుపెడితే కాంగ్రెస్ ఏం కానుందన్న విషయం చర్చనీయమవుతోంది.
అమిత్ షా మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. అమిత్ షా టూర్ నల్గొండలో ఉండడంతో కాంగ్రెస్ హైకమాండ్ అటువైపు దృష్టిపెట్టింది. అక్కడ ఏం జరగబోతుందో తెలుసుకోవాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించిందట. నల్గొండలో కాంగ్రెస్ బలంగా ఉంది. అక్కడా ఏమైనా మన పార్టీకి బీటలు బీజేపీ కొట్టబోతుందా? అని ఢిల్లీ పెద్దలు అడిగారట. అయితే అలాంటిదేమి లేదని ఉత్తమ్ చెప్పారట. కానీ, కాంగ్రెస్ నుంచి 20 మంది నేతలు అమిత్ షాతో టచ్ లో ఉన్నారని ఉన్నారంటూ వారి పేర్లన్నీ అధిష్ఠానం ముందు పెట్టారట కెప్టెన్.
వారితో బీజేపీ పెద్దలు చర్చలు జరిపారని.. కానీ ఆ చర్చలు ఫలప్రదం కాలేదని చెప్పారట. స్టేట్ బీజేపీలో విచిత్ర పరిస్థితులున్నాయని…అక్కడికి ఎవరూ వెళ్లరని ఉత్తమ్ కొత్త థియరీ ఒకటి చెప్పినా అధిష్ఠానం నమ్మలేదని టాక్. అమిత్ షా వచ్చాక అసలు రంగు బయటపడుతుందని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/