Begin typing your search above and press return to search.

మ‌రీ.. అంత తొంద‌రేంది ఉత్త‌మ్‌?

By:  Tupaki Desk   |   10 Dec 2018 5:19 AM GMT
మ‌రీ.. అంత తొంద‌రేంది ఉత్త‌మ్‌?
X
ఓట‌ర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారో ఎవ‌రికీ తెలీకున్నా.. ఎవ‌రి ఆశ‌లు వారివి. ఎవ‌రి అంచనాలు వారివి. గెలుపు మీద టీఆర్ఎస్‌.. కూట‌మి రెండు ప‌క్షాలు ఒకే రీతిలో రియాక్ట్ అవుతున్న వేళ‌.. కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కాస్త ఎక్కువ‌గా తొంద‌ర‌ప‌డుతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల విడుద‌ల‌కు మ‌రో రోజు టైం ఉన్న వేళ‌.. ఆయ‌న నోటి నుంచి వ‌స్తున్న మాట‌లు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి.

ఒక్క ల‌గ‌డ‌పాటి స‌ర్వే మిన‌హా మ‌రే ఎగ్జిట్ పోల్స్ త‌మ‌కు అనుకూలంగా లేన‌ప్ప‌టికీ.. అధికారంలోకి వ‌చ్చేది తామేన‌న్న‌ట్లుగా మాట్లాడ‌టం ఉత్త‌మ్‌కు ఈ మ‌ధ్య అల‌వాటుగా మారింది. తెల్లార‌క ముందే కోడి కూసిన చందంగా.. గెలుస్తారో లేదో తెలీన‌ప్ప‌టికీ త‌మ కూట‌మిని ఒక జ‌ట్టుగా గుర్తించాలంటూ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కు విన్న‌వించుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఓప‌క్క 80 సీట్లు ప‌క్కా అని చెబుతూనే.. మ‌రోప‌క్క తాము అనుకున్న సీట్లు రాకుండా.. హంగ్ లాంటిది ఏర్ప‌డితే కూట‌మి ద‌న్ను నిలిచేందుకు వీలుగా ఆయ‌న తాజా మాట‌లు ఉండ‌టం గమ‌నార్హం. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌.. తెలుగుదేశం.. తెలంగాణ జ‌న‌స‌మితి.. సీపీఐలు క‌లిసి ప‌ని చేశామ‌ని.. తామంతా ఒక కూట‌మిగా ఏర్ప‌డిన విష‌యాన్ని గ‌వ‌ర్నర్ కు గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు.

ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన అన్ని చ‌ర్య‌ల్ని తీసుకోవాల‌ని కోరటం త‌ప్పేమీ కాకున్నా.. ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే వేళలో కూట‌మికి కానీ మెజార్టీ వ‌స్తుంటే ఇలాంటి మాట‌లు మాట్లాడ‌టం బాగుంటాయి. కానీ.. అలాంటిదేమీ లేకున్నా.. ఫ‌లితాల వెల్ల‌డికి రెండు రోజుల ముందు నుంచే గ‌వ‌ర్న‌ర్ ఎలా నిర్ణ‌యం తీసుకోవాలో చెప్పేలా ఉత్త‌మ్ మాట్లాడ‌టం స‌రిగా లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ రోజున త‌న అనుచ‌ర గ‌ణంతో గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వాల‌ని ఉత్త‌మ్ డిసైడ్ కావ‌టం తెలిసిందే. ప్ర‌జాకూట‌మిని ఒక జ‌ట్టుగా గుర్తించాల‌న్న విన్న‌పంతో గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వ‌నున్న ఉత్త‌మ్ అండ్ కో తీరు చూస్తే.. కామెడీగా అనిపించ‌క మాన‌దు. ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న విష‌యంపై ఎలాంటి క్లారిటీ రాక ముందే.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు సంబంధించిన ముచ్చ‌ట మాట్లాడ‌టం ఏమైనా స‌బ‌బా ఉత్త‌మ్‌?