Begin typing your search above and press return to search.
ప్రశ్నిస్తే బూతులు తిడతారా? ఈ ఆవేదన ఏంది ఉత్తమ్?
By: Tupaki Desk | 9 May 2020 5:30 PM GMTఅలవాటైన అనుభవం మరోసారి ఎదురైన వేళ.. తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెగ ఫీలైపోతున్నారు. ఇటీవల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. విపక్ష కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. దేశంలో మరెక్కడా లేని రీతిలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తున్న వేళ.. పొగడ్తలు మానేసి ఇలా తిట్టిపోస్తారా? అని మండిపడుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కులాశాగా చెప్పిన మాటల్లోని డొల్లతనాన్ని తేల్చి చెప్పేందుకు తెగ ట్రై చేస్తున్న ఉత్తమ్ అండ్ కో.. తాజాగా కరీంనగర్ లోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులుగా కేవలం 25 శాతం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని మండిపడ్డారు. 42 కేజీల ధాన్యాన్ని 40 కేజీలకే కొనుగోలు చేయాలని.. అందుకు భిన్నంగా నాలుగు కేజీలు తరుగు తీసేస్తున్నట్లుగా ఆరరోపించారు.
ఈ సందర్భంగా తెలంగాణ అధికారపక్షానికి చెందిన నాయకుడు ఒకరు మిల్లర్లతో కుమ్మక్కు అయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతుల పంట కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలన్ని అబద్ధాలుగా కొట్టిపారేసిన ఉత్తమ్.. తెలంగాణలో కంటే మెరుగ్గానే కాంగ్రెస్ రాష్ట్రం పవర్లో ఉన్న రాష్ట్రాల్లో రైతలుకు న్యాయం జరుగుతోందన్న ఉత్తమ్.. తన మాటలతో కేసీఆర్ మాయ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
కందుల రైతుల విషయంలో తాము ప్రభుత్వాన్ని నిలదీస్తే.. దానికి సూటి సమాధానం చెప్పకుండా.. విపక్షాలపై విరుచుకుపడితే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. అయినా.. ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారని తెగ ఫీల్ అయిపోతున్న ఉత్తమ్.. ఇలాంటి అనుభవం ఇదేమీ తొలిసారి కాదుగా? ఎదుటోళ్లు ఎవరైనా సరే.. అయితే పొగడాలి లేదంటే కామ్ గా ఉండాలి. అంతే తప్పించి.. ఎదురు ప్రశ్న వేసినా.. ఇబ్బంది పెట్టే సందేహాన్ని తెర మీదకు తెచ్చినా తన మాటలతో ఉతికి ఆరేసే కేసీఆర్ తీరుతో ఉత్తమ్ బ్యాచ్ ఉక్కిరిబిక్కిరి అవుతుందని ఆయన నోటి వెంట వచ్చిన తాజా మాటల్ని చూస్తే.. ఇట్టే అర్థమైపోతుందని చెప్పక తప్పదు.