Begin typing your search above and press return to search.
పదవికి ఉత్తమ్ గుడ్ బై..ఆవేదన తర్వాతే నిర్ణయం?
By: Tupaki Desk | 31 Dec 2019 5:07 PM GMTతెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజుల్లో పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. పీసీసీ బాధ్యతలతో సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోతున్నందునే - రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికలపై హుజూర్ నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. అయితే, గత కొద్దికాలంగా త్వరలో పీసీసీ అధ్యక్షుడు మార్పు జరుగుతుందనే ప్రచారం కొనసాగుతుండగా...ఉత్తమ్ ఈ నిర్ణయం ప్రకటించడం సంచలనంగా మారింది.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ...మున్సిపల్ ఎన్నికల అంశంపై మాట్లాడిన తనపై అధికార పార్టీ నేతలు ఎదురుదాడి చేశారని.. కానీ వారి దాడిపై కాంగ్రెస్ నేతల్లో ఒక్కరు కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. ‘నన్ను తిడుతుంటే ఒక్కరు కూడా కౌంటర్ ఇవ్వరా?’ అని ప్రశ్నించారు. పార్టీలో రెండువర్గాలుగా వీడిపోతున్నారని - కొందరి తీరు సరిగా లేదని నేతలతో బహిరంగంగా ఉత్తమ్ చెప్పుకొచ్చారు. సీనియర్లు ఎవరికివారే వ్యవహరిస్తున్నారని, పార్టీలో ఏం జరుగుతుందో తెలియడం లేదంటూ కోర్ కమిటీ సమావేశంలో అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇలా కామెంట్లు చేసిన కొద్దిరోజులకే ఉత్తమ్ ఈ నిర్ణయం వెలువరించారు.
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన రాజీనామా గురించి సొంత నియోజకవర్గ కార్యకర్తలకు వివరిస్తూ... మున్సిపల్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నట్టు వెల్లడించారు. పదవిని వదిలిన తర్వాత హుజూర్ నగర్ - కోదాడ ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంటానని ఉత్తమ్ స్పష్టం చేశారు. త్వరలోనే హుజూర్ నగర్ లో ఇల్లు కూడా మొదలు పెట్టి... ఇక్కడే అందుబాటులో ఉండనున్నట్టు ప్రకటించారు.