Begin typing your search above and press return to search.
2 నెలల నుంచి శానిటరీ కార్మికులకు జీతాల్లేవట!!
By: Tupaki Desk | 13 April 2020 5:15 PM GMT`కరోనా కాలం`లోనూ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష మధ్య కరోనా కేంద్రంగా విమర్శలు-ప్రతి విమర్శలు జరుగుతున్న తరుణంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్ సంచలనం రేకెత్తిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సకల చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ ప్రెస్‌మీట్లలో చేసిన ప్రకటనలపై ఉత్తమ్ భగ్గుమన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 22 రాష్ట్రాలలో ICMR గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో కరోనా వైరస్ టెస్ట్ లు చేస్తుంటే తెలంగాణలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కరోనా వైరస్ అరికట్టడం కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చులు నామమాత్రమేనని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ ప్రకటనలకు వాస్తవానికి మధ్య ఎంతో తేడా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మండిపడ్డారు. ``మున్సిపల్ పారిశ్యుద్ద కార్మికుల గురించి సీఎం కేసీఆర్ చెప్పే మాటలు చేతల్లో లేవు. వారికి పరిశుభ్రత కోసం సబ్బులు లేవు. గ్లౌజ్‌లు, శానిటైజేషన్ వంటివి లేదు. వారికి అదనపు గిఫ్ట్ సంగతి పక్కకు పెడితే.. రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు` అని ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శానిటైజేషన్ వర్కర్లు, పోలీసులు, హెల్త్ సిబ్బందితో పాటు అత్యవసర సేవల్లో ఉన్న వారికి 30శాతం అదనంగా జీతాలు ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.రాష్ట్రంలో అర కిలోమీటర్‌కు ఒక అన్నదాన కేంద్రమని సీఎం కేసీఆర్ ప్రకటించారని .అయితే అవి ఎక్కడా కన్పించడం లేదని ఆరోపించారు
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు ఆగిపోయాయని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కరోనా కంటే ముందు నుంచే 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లు సమ్మెలో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోమని వారు కోరుతున్నా…కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లాక్ డౌన్ తో ఆదాయం తగ్గింది అంటున్న సీఎం కేసీఆర్ గతంలో బాండ్ల ద్వారా సేకరించిన 3,500 కోట్ల రూపాయలు ఏమీ చేశారో సమాధానం చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.