Begin typing your search above and press return to search.
ఒళ్లు బలిసింది కేసీఆర్..నువ్వేమైనా తీస్మార్ ఖాన్ వా?
By: Tupaki Desk | 28 April 2018 11:44 AM GMTతెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో టీఆర్ ఎస్ అధినేత - ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అదే స్థాయిలో ఎదురుదాడి చేసింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - మండలి పక్ష నాయకుడు షబ్బీర్ అలీ గులాబీ దళపతి తీరుపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ వి అడ్డగోలు మాటలని ఉత్తమ్ మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం రాజనీతిఘ్నుడుగా .. స్టేట్స్ మెన్ గా ఉండాలని కోరుకున్నామని అయితే కేసీఆర్ చిల్లరగా వ్యవహరిస్తున్నాడని ఉత్తమ్ మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు కేసీఆర్‌కు తగవని తెలిపారు. `నేను ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో సైన్యంలో పనిచేసిన వ్యక్తిని. రాజకీయాల్లో క్యారెక్టర్ లేని వారు నాపై విమర్శలు చేయడమా? కేసీఆర్ కుటుంబం రాష్ట్రం మీద పడి దోచుకుంటోంది. నేను - నా భార్య నిస్వార్థంతో రాజకీయాల్లో పనిచేస్తున్నాం .. నాకు పిల్లలు లేరు .. వారసత్వం లేదు. కేసీఆర్ లాగా నేను క్యారెక్టర్ లెస్ పనులు చేసి నేను రాజకీయాల్లోకి రాలేదు` అని ఉత్తమ్ ఆరోపించారు.
వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎవడబ్బ సొమ్మని ప్రగతి భవన్ కట్టుకున్నావు కేసీఆర్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. `ప్రగతి భవన్ 150 గదులు ఉన్నాయని నేను ఎప్పుడు అనలేదు. ప్రధాని నివాసానికి మించి విలాసవంతమైన భవనం కట్టుకున్నాడని చెప్పాను. లక్ష స్క్వేర్ ఫీట్లలో ఇల్లు కట్టుకున్నావా లేదా కేసీఆర్? ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్లలో తిరుగుతున్న మాట వాస్తవం కాదా? పెళ్లిళ్లకు పేరంటాలకు చార్టెడ్ ఫ్లైట్స్ లో తిరుగుతున్న మాట వాస్తవం కాదా? రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలి. ప్రజల సొమ్ము దుర్వినియోగంపై ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతతో ప్రశ్నిస్తున్నాం. దీనిపై జవాబు చెప్పకుండా విమర్శలు ఎందుకు?` అని ఉత్తమ్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. తాను ఎప్పుడు ఆంధ్ర నేతల సంచులు మోయలేదని తెలిపారు. తెలంగాణ ముసుగులో రాష్ట్ర సొమ్మును ఆంధ్రా కాంట్రాక్టర్లకు కేసీఆర్ దోచిపెడుతున్నారని ఆరోపించారు.
సీఎం అధికార నివాసంలో సామాన్య ప్రజాలెవరూ కనపడరు .. ఆంధ్రా కాంట్రాక్టర్స్ కనపడతారని ఉత్తమ్ మండిపడ్డారు. `రాష్ట్ర ప్రజల సొమ్మును తిని తిని తెగబలసి మాట్లాడుతున్నాడు కేసీఆర్. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన ఘనత నీది. జాతీయ పార్టీలు ఏమీ చేయలేదట .. ఈయన ఓ తీస్మాన్ ఖాన్. ఈయన ఎదో చేస్తాడట. వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ఒక్క ఎంపీ సీటు రాదు .. ఇక జాతీయ రాజకీయాలు ఏం చేస్తావు. భారత్ ను చైనాతో పోల్చడం అవగాహనా రాహిత్యం. తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శం అనడం దగుల్బాజీ మాటలు. సర్కార్ వైఫల్యాలవల్లనే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ముస్లిం రిజర్వేషన్ల అమలుపై ప్లీనరీలో ఎందుకు మాట్లాడలేదు? ఉద్యోగ ఖాళీలు ఎందుకు నింపలేదు? గిరిజనుల రిజర్వేషన్స్ ఏమయ్యాయి? దళితులకు మూడెకరాల భూమి .. డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్ల నిర్మాణం ఏమైంది?` అని ప్రశ్నల వర్షం గుప్పించారు.
శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేసీఆర్ కాంగ్రెస్ మీద విమర్శలు చేసే ముందు తన జీవితం ఏమిటో వెనక్కి తిరిగి చూసుకోవాలని కోరారు. `దొంగ పాస్ పోర్టుల చరిత్ర నీది కాదా? ఉత్తమ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. ఉత్తమ్ దేశం కోసం సైన్యంలో పనిచేసిన వ్యక్తి. నీ చరిత్ర ఏంటి .. నీ కుటుంబ చరిత్ర ఏమిటి? భూకంపం సృష్టించం కాదు .. నీకు ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో కాలు పెట్టు` అని వ్యాఖ్యానించారు. ప్రజలు కేసీఆర్ ను హైదరాబాద్ ఫేక్ అనుకుంటున్నారని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు.