Begin typing your search above and press return to search.

కేసీఆర్ అవినీతి ఖాతాలో ఇంకో రికార్డ్ చేరింది

By:  Tupaki Desk   |   7 May 2018 12:22 PM GMT
కేసీఆర్ అవినీతి ఖాతాలో ఇంకో రికార్డ్ చేరింది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మ‌రోమారు మండిప‌డ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి - సంపత్ కుమార్‌ ల సభ్యత్వ రద్దుపై హైకోర్టు తీర్పును అమలు చేయాలని హైదరాబాద్‌ లో టీ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్‌ ను కలిసి ఫిర్యాదు చేశారు. అలాగే అకాల వర్షంతో రైతులకు కల్గిన నష్టంపై గవర్నర్‌ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు పర్చకుండా చూడ‌టం స‌రికాద‌ని మండిప‌డ్డారు. అనంత‌రం మీడియాతో ఆయ‌న ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వం గా మారిందని ఆరోపించారు. ప్రతి ప్రభుత్వ పథకంలో అవినీతేన‌ని ఉత్త‌మ్ మండిప‌డ్డారు. చివరకు రైతు పట్టా పాస్ పుస్తకాల ముద్రణ విషయంలో కూడా అవినీతి జ‌రిగింద‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు.

పాస్ పుస్తకాల ముద్రణా 50 రూపాయలలో చేస్తాం అని కొన్ని ముద్రణా సంస్థలు చెబుతుంటే,కాదని 160 రూపాయలకు ముద్రణకు ఇచ్చారని, ఈ విషయంలో 80 కోట్ల అవినీతి జరిగిందని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. `26 రకాల ప్రత్యేకతలతో రైతు పట్టా పాస్ పుస్తకాలు వాటర్ ఫ్రూఫ్ ,టాంపర్ ఫ్రూఫ్ అని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాడు. కానీ ఇవి ఏ ఫ్రూఫ్ కాదు. కేసీఆర్‌వి అన్నీ అబద్ధాలే. కేసీఆర్ ఎన్నో సార్లు ప్రకటన చేశారు పట్టా పాస్ పుస్తకాల పంపిణీ చేస్తామని అన్ని సార్లు వాయిదా వేస్తూ వచ్చి..ఎట్ట‌కేల‌కు ఇప్పుడు సిద్ధ‌మ‌య్యారు.`అని ఆరోపించారుఉ. `72లక్షల పాస్ బుక్ లు సెక్యూరిటీ ప్రింటింగ్ కేంద్రప్రభుత్వ ముద్రణ మింట్ కంపాండ్ లో ముద్రించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అన్ని ప్రభుత్వ సమీక్షలకు సంస్థ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ హాజ‌ర‌య్యారు. ప‌ట్టా పాస్ బుక్ పైన కాకతీయ ఆర్చ్ - చార్మినార్ - అట‌వీ ప్రాంతం - వ్యవసాయం చేస్తున్న‌ రైతు చిత్రాలు ముద్రించాలి అని నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ ప్రభుత్వ టెండరును రద్దు చేసింది. నకిలీ - ఫోర్జరీ వంటి అవకతవకలు జరిగితే మాకు సంబంధం లేదు అని కేంద్ర ప్రభుత్వ మింట్ కాంపౌండ్ సెక్యూరిటీ ముద్రణ జనరల్ మేనేజర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. పాస్ పుస్తకాల ముద్రణలో రక్షణ కు సంబంధించిన నిబంధనలు తొలగించడం ,మార్చడం మంచింది కాదు అని లేఖలో పేర్కొన్నారు.` అని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.టెండరులో అర్హత ఉన్న సంస్థలకు కాకుండా బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలకు పనులను కేటాయించారని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. `

మణిపాల్ టెక్నాలజీస్ - మద్రాస్ సెక్యూరిటీ ప్రింటింగ్- ,శ్రీనిధి సెక్యూర ప్రింటింగ్ - హైటెక్ సెక్యూరిటీ ప్రింటింగ్, కేఎల్ సెక్యూరిటీ ప్రింటింగ్ సంస్థలకు ముద్రణకు ఇచ్చారు. ఇందులో డిస్ క్వాలిఫై అయిన కంపెనీలు మద్రాస్ కంపెనీ,శ్రీనిధి కంపెనీలు ఉన్నాయి. కేసీఆర్ చెప్పినటువంటి ఈ పట్టా పాస్ పుస్తకాల్లో ఏ రకమైన భద్రత అంశాలు లేవు. ఈ పట్టా పాస్ పుస్తకాల్లో ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్ లేవు,26 రకాల సెక్యూరిటీ ఫీచర్స్ అని చెప్పి రైతులను మోసం చేస్తుంది. అవకతవకలకు తావు లేకుండా పట్టా పాస్ పుస్తకాల ముద్రణ అన్న కేసీఆర్ ,ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ లేకుండా ముద్రిస్తూ,పుస్తకాల ముద్రనలోనే అవినీతి చేస్తున్నారు. నాసిరకం పట్టా పాస్ పుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది.` అంటూ ఉత్త‌మ్ విరుచుకుప‌డ్డారు.