Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్, బీజేపీ వాళ్లు ఇప్పుడు ఏం చెప్తారు తెలంగాణ సమాజానికి..?
By: Tupaki Desk | 8 Dec 2021 4:30 PM GMTధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ సర్కార్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నది. ధాన్యం కొనడం లేదని కేంద్రాన్ని అభాసుపాలు చేసింది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సైతం ధర్నా చేసి జాతీయ స్థాయిలో చర్చకు దారితీశారు. అనంతరం పార్లమెంట్ ను స్తంభింపచేస్తూ ఆందోళనలను టీఆర్ఎస్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని నిన్నటి వరకు ఆందోళన చేసిన టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప సమస్యను పరిష్కరించే దారి చూపడం లేదు. ఇందులో భాగంగా బుధవారం మరోసారి ధాన్యం కొనుగోలుపై చర్చ సాగింది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ డ్రామా చూపించి ఆ తరువాత ఏం మాట్లాడలేకుండా సమావేశాలు బహిష్కరించారని అన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై కేంద్ర ఆహార మంత్రి పీయూస్ గోయల్ స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ' ఉత్తమ్ కుమార్ లేవనెత్తిన అంశానికి, ప్రస్తుతం నడుస్తున్న చర్చకు సంబంధం లేదు వరిధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత రాష్ట్రానిదే. కేంద్రానికి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంటుంది. తెలంగాణ ప్రభుత్వం బాయిల్డ్ రైస్ సరఫరా చేయడంలో విఫలమైంది.ఈ విషయంపై ఇప్పటికే విధి విధానాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పాం.' అని అన్నారు.
ఇలా కేంద్రం కొనాలని తెలంగాణ ప్రభుత్వం ఓవైపు ఆందోళన చేస్తుంటే.. అబ్బే ధాన్యం కొనుగోలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని.. కేంద్రానికి సంబంధం లేదని కేంద్రమంత్రి పార్లమెంట్ సాక్షిగా కుండబద్దలు కొట్టారు. బియ్యం మాత్రమే కేంద్రం ద్వారా ఎఫ్.సీఐ కొనుగోలు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానిదే ధాన్యం కొనుగోలు బాధ్యత అని కేంద్రం కాడివదిలేసింది. ఇలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాటలో పాపం రైతులు అన్యాయం అయిపోతున్నారని తాజాగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది.ఉత్తమ్ దీనిపైనే కేంద్రాన్ని నిలదీశారు. టీఆర్ఎస్, బీజేపీ వాళ్లు ఇప్పుడు ఏం చెప్తారు తెలంగాణ సమాజానికి..? అని ప్రశ్నించారు.