Begin typing your search above and press return to search.
ఎన్నికల్లో ఫలితాలతో ఉత్తమ్ సృష్టించిన రికార్డ్ ఇదే
By: Tupaki Desk | 12 Dec 2018 4:36 AM GMTతెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల్లో మరో కీలక పరిణామం తెరమీదకు రానుంది. ఇప్పటికే విజయంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవగా మరో పరిణామం ఆ పార్టీ నేతలను వేధించడానికి తోడుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీయడం అనే అంశం ఆసక్తికరంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలువకుంటే గడ్డం గీయనని ఉత్తమ్ శపథం చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఓటమి ఏమో కానీ.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం గడ్డం భారంగా మారనుందని అంటున్నారు. మరో ఐదేళ్లు ఆయన గడ్డం ఉత్తమ్ గానే మిగిలిపోనున్నారు.
మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ ఎస్ కు స్పష్టమైన మెజార్టీతో రావడంతో కాంగ్రెస్ కంగుతిన్నది.కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులు ముఖ్యమంత్రి కేసీఆర్ సునామీలో కొట్టుకుపోయారు. ముఖ్యమంత్రి అభ్యర్థులుగా తమకుతామే ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ సీనియర్లంతా ఓటమి బాటపట్టారు. ఒకరిద్దరు మినహా ఉద్ధండులంతా ఊడ్చుకుపోయారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు నాయకుడినంటూ చెప్పుకునే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కొడంగల్ ప్రజలే తిరస్కరించారు. సీఎల్పీనేత కుందూరు జానారెడ్డి - మండలిలో ప్రతిపక్షనాయకుడు షబ్బీర్ అలీ - పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య - మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ - మాజీమంత్రులు గీతారెడ్డి - టీ జీవన్ రెడ్డి - జీ చిన్నారెడ్డి - సునీతా లక్ష్మా రెడ్డి - కొండా సురేఖ - నాగం జనార్దన్ రెడ్డి - మల్లురవి - మాజీ ఎంపీలు సర్వే సత్యనారాయణ - పొన్నం ప్రభాకర్ - బీసీ నేత ఆర్ కృష్ణయ్య - ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిరెడ్డి ఓటమి పాలయ్యారు.
ఈ ఓటమి ఓ వైపు అలా ఉంండగా, ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తన గడ్డాన్ని అలాగే కొనసాగించాల్సిన గడ్డు పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా మారింది. గడ్డం ఇలాగే కొనసాగిస్తే...సుదీర్ఘ కాలం గడ్డం కొనసాగించిన నాయకుడిగా - అందులోనూ రాజకీయ శపథం ద్వారా గడ్డాన్ని భారీగా పెంచేసిన వ్యక్తిగా ఆయన మిగిలిపోనున్నారని అంటున్నారు.