Begin typing your search above and press return to search.

టీ ఆంధ్రోళ్ల‌కు టికెట్లు..ఉత్త‌మ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

By:  Tupaki Desk   |   31 July 2018 5:13 AM GMT
టీ ఆంధ్రోళ్ల‌కు టికెట్లు..ఉత్త‌మ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న
X
సంచ‌ల‌న రాజ‌కీయ ప్ర‌క‌ట‌న చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. తెలంగాణ‌లో నివ‌సించే ఆంధ్రా.. రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారేన‌ని.. వారికి లోక్ స‌భ‌.. అసెంబ్లీ టికెట్ల‌ను కేటాయిస్తామంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో టికెట్ల జారీలో వారికి స‌ముచిత స్థానాన్ని క‌ల్పిస్తామ‌న్న ప్ర‌క‌ట‌న‌ను చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామ‌న్న కోపంతో కాంగ్రెస్సేత‌ర పార్టీల‌కు ఓట్లు వేశారని.. గ‌త ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టికి వాతావ‌ర‌ణం బాగా మారింద‌న్న ఉత్త‌మ్‌.. తెలంగాణలోని ఆంధ్రోళ్లు త‌మ‌కే ఓట్లు వేయ‌నున్న‌ట్లు చెప్పారు. హైద‌రాబాద్‌ లో అత్యంత ప్ర‌భావం చూపే మైనార్టీలు.. ఆంధ్రా రాయ‌ల‌సీమ వాసులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ప‌లుకుతార‌ని పేర్కొన్నారు. ఉత్త‌మ్ తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న‌తో తెలంగాణ రాజ‌కీయంలో వేడి పుట్టించ‌టం కాయ‌మ‌ని చెప్పాలి.

ఇంత‌కాలం తెలంగాణ‌లో సెటిల్ అయిన ఆంధ్రా ప్రాంత వాసుల‌కు రాజ‌కీయ అండ లేద‌న్న ఆందోళ‌న ఉండేది. దీని స్థానే.. తాజాగా ఉత్త‌మ్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో రాజ‌కీయాల్లో వేడి పుట్ట‌ట‌మే కాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆస‌క్తిక‌ర కాంబినేష‌న్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదిలా ఉంటే.. కేసీఆర్ పై ఉత్త‌మ్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర విభ‌జ‌న బిల్లు త‌న క‌నుస‌న్న‌ల్లో జ‌రిగిన‌ట్లుగా చెప్పేవార‌ని.. మ‌రి అలాంట‌ప్పుడు విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న గిరిజ‌న వ‌ర్సిటీ.. రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ.. బ‌య్యారం ఉక్కు క‌ర్మాగారం లాంటివాటిని నాలుగేళ్లు దాటినా ఎందుకు సాధించ‌లేక‌పోతున్నార‌ని ప్ర‌శ్నించారు.

తెలంగాణ‌కు హైదరాబాద్ ను ఇచ్చేసి.. ఆంధ్రప్ర‌దేశ్‌ కు ఏ స్టేట‌స్ ఇచ్చినా త‌మ‌కు ఇబ్బంది లేదంటూ కేసీఆర్ నాడు చేసిన వ్యాఖ్య వాస్త‌వం కాదా? అని ప్ర‌శ్నించిన ఉత్త‌మ్‌.. హైద‌రాబాద్‌ ను తెలంగాణ‌కు చెందేలా చేసిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీదేన‌ని చెప్పారు. తెలంగాణ‌ను అన్ని ర‌కాలుగా మోసం చేస్తున్న బీజేపీకి కేసీఆర్ బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని.. మోడీకి ఏజెంట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. పార్ల‌మెంటు స‌మావేశాల త‌ర్వాత నుంచి ప్ర‌తి నెలా రాహుల్ టూర్ తెలంగాణ‌లో ఉంటుంద‌ని ఉత్త‌మ్ చెప్ప‌టం చూస్తుంటే.. రానున్న రోజుల్లో రాజ‌కీయం మ‌రింత ర‌స‌కందాయంలో ప‌డ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.