Begin typing your search above and press return to search.
కేటీఆర్-ఉత్తమ్..‘ఓ సోనియా సెంటిమెంట్’ కథ..
By: Tupaki Desk | 3 July 2018 5:10 AM GMTతెలంగాణ ఏర్పడి నాలుగేళ్లు పూర్తయ్యాయి. స్వరాష్ట్రం కోసం కొట్లాడి సాధించుకున్న ప్రజలందరూ ఇక అభివృద్ధి మీదే దృష్టిసారించారు. ఈ ప్రభుత్వం ఏర్పడితే తమకు ఏం ప్రయోజనం దక్కుతుంది.? ఎవరు గెలిస్తే మాకెంత వరకు లాభమనే ఆలోచిస్తున్నారు. అంతేకానీ తెలంగాణ ఇచ్చిన వారిని - తెచ్చిన వారిని గుర్తించి ఓటేసే పరిస్థితులు అయితే లేవు.
ఈ చిన్న లాజిక్ ను మిస్సయ్యారు కనుకే గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణలో ఘోరంగా ఓడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ప్రకటించాక అప్పటి వరకూ రాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్ అనూహ్యంగా రూటు మార్చాడు. వృద్ధులకు 1000 పింఛన్లు - రేషన్ - మిషన్ కాకతీయ - భగీరథ సహా పలు ప్రజాకర్షక పథకాలు ప్రకటించి వాటిని జనంలోకి తీసుకెళ్లి అధికారం కొల్లగొట్టారు. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం హామీల సంగతి పక్కనపెట్టి ‘సోనియా తెలంగాణ ఇచ్చింది కాబట్టి తమకే ఓటేయాలని’ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఆ ప్రయోగం విఫలమైంది.
ప్రజలెప్పుడు ముందుచూపుతో వ్యవహరిస్తారు. ఒక లక్ష్యం చేరాక కూడా ఇంకా పాత దాని గురించే ఆలోచిస్తూ కూర్చోరు. అది కుటుంబ సమస్య అయినా.. రాష్ట్ర సమస్య అయినా అప్ డేట్ అవుతూనే ఉంటారు. రేపటి గురించి ఆలోచించినట్టుగా నిన్న ఏ జరిగిందని ఆలోచిస్తూ కూర్చొరు. ఈ లాజిక్ తెలుసు కనుకే.. తెలంగాణ తెచ్చామని కేసీఆర్ ప్రచారం చేసుకోకుండా తెలంగాణ ఏర్పాడ్డాక తానేం చేస్తానో ప్రజలకు వివరించారు.. గెలిచారు. కాంగ్రెస్ 2014లో ఓడిపోవడానికి సోనియా తెలంగాణ ఇచ్చిందని సెంటిమెంట్ అస్ర్తాన్ని కాంగ్రెస్ ప్రయోగించడమే ప్రధాన కారణం.
ఇప్పుడూ అదే గొడవ.. ఇటీవల మంత్రి కేటీఆర్ సోనియాపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.. తాజాగా దానిని ఖండిస్తూ ఉత్తమ్ రీట్వీట్ చేశారు. సోమవారం కూడా ఈ ట్వీట్ యుద్ధాన్ని ఉత్తమ్ కొనసాగించారు. ‘‘సోనియా దయతోనే తెలంగాణ వచ్చింది. ఈ నిజాన్ని అంగీకరించనివాడు మూర్ఖుడు అని కేసీఆర్ అన్నారు. మరి మీరు మీ నాన్నతో విభేదిస్తారా.?’ అని మంత్రి కేటీఆర్ ను పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. అంతేకాదు.. సోనియాగాంధీని పొగుడుతూ కేసీఆర్ గతంలో చేసిన ప్రసంగం వీడియోను ఉత్తమ్ పోస్ట్ చేశారు. ‘మా నాయకురాలు సోనియా గాంధీ గురించి కేసీఆర్ ఏం మాట్లాడారో చూడండి..’ అని సెటైర్ వేశారు.
ఇలా ఎప్పుడో జరిగినపోయిన వాటిపై ప్రజలకు ఆసక్తి ఉండదు. ఎవరు ఇచ్చారు.. ఎవరు తెచ్చారనేది ప్రజలకు అనవసరం.. అధికారంలోకి వస్తే మాకేంటి అని మాత్రమే ఆలోచిస్తారు. ఈ చిన్న లాజిక్ ను ఇంకా అర్థం చేసుకోకుండా సెంటిమెంట్ కు యాంటిమెంట్ పూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షంగా టీఆర్ ఎస్ ను నిలువరించాలంటే రాబోయే ఎన్నికల్లో ఏం చేస్తామనేది చెబితే మంచిదంటున్నారు రాజకీయ విశ్లేషకులు..