Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఈ ట్విస్ట్ ఊహించ‌లేదేమో

By:  Tupaki Desk   |   26 Aug 2016 3:15 PM GMT
కేసీఆర్ ఈ ట్విస్ట్ ఊహించ‌లేదేమో
X
తెలంగాణ‌లో నీటి యుద్ధం ముదురుపాకాన ప‌డుతోంది. రీడిజైనింగ్‌లతో మొద‌లైన ఈ ర‌భ‌స మ‌హారాష్ట్ర ఒప్పందంతో తారాస్థాయికి చేరింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ ఒప్పందాన్ని త‌న విజ‌యంగా ప్ర‌చారం చేసుకుంటుండ‌గా.. ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ కొత్త రూపంలో ముందుకు వ‌చ్చి ఏకంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపాయి.

గాంధీభవన్‌ లో కాంగ్రెస్‌ నేతలు స‌మావేశం నిర్వహించుకున్న‌ అనంత‌రం కాంగ్రెస్ నేత‌లు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీ కాంగ్రెస్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపారు. క్షేత్ర‌స్థాయిలో జిల్లాలు - నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌ర్కారు త‌ప్పుడు ఒప్పందాన్ని తిప్పి కొడ‌తామ‌ని చెప్పారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం హ‌యాంలో ఒప్పందం పూర్త‌యిన‌ప్ప‌టికీ ఇప్ప‌డు తామేదో కొత్త‌గా చేస్తున్న‌ట్లుగా ప్ర‌చారం చేసుకుంటున్నాయ‌ని కానీ ఇది గ‌తంలో ఏనాడో పూర్త‌యిన‌దేన‌ని కాంగ్రెస్ పేర్కొంది. తాము హైద‌రాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన వాస్తవ జ‌ల‌దృశ్యంకు పెద్ద ఎత్తున స్పంద‌న వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ మేర‌కు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంచుకున్న‌ట్లు కాంగ్రెస్ నాయ‌కులు వివ‌రించారు. పీపీసీ చీఫ్ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో స‌ర్కారుపై త‌మ పోరాటం కొన‌సాగిస్తామ‌ని చెప్పారు.

త‌మ ప్ర‌చారం ద్వారా ముఖ్య‌మంత్రి ఓపిక‌ను పరీక్షించ‌నున్న‌ట్లు కాంగ్రెస్ నాయ‌కుడు ఒక‌రు తెలిపారు. మ‌హారాష్ట్ర ఒప్పందం చేసుకున్న అనంత‌రం న‌గారానికి వ‌చ్చిన సీఎం త‌న హోదాను మ‌రిచి విమ‌ర్శ‌లు చేసిన తీరు ఆయ‌న అస‌హ‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ముఖ్య‌మంత్రి మ‌రింత‌గా ఇర‌కాటంలో ప‌డేసేందుకు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జెంటేష‌న్‌ లు ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌జెంటేష‌న్‌ పోరాటం చేయ‌నున్న‌ట్లు తెలిపింది.