Begin typing your search above and press return to search.
ఉత్తమ్ కుమార్ రెడ్డికి వరంలా మారిన కరోనా
By: Tupaki Desk | 29 April 2020 2:59 PM GMTకరోనా కల్లోలంతో దేశవ్యాప్తంగా ఎవ్వరికి ఇంకో పని లేకుండాపోయింది. కరోనా కేసులు, మరణాల సంఖ్యను లెక్కబెట్టడం.. ఇంట్లో ఉన్నది తిని సుబ్బరంగా పడుకోవడానికే సమయం పోతోంది. ఈ సమయంలో రాజకీయాల గురించి అస్సలు మాట్లాడడానికి... పెద్దగా డెవలప్ మెంట్స్ చేయడానికి కూడా పార్టీలకు సమయం లేదని చెప్పాలి. అసలు రాజకీయ వార్తలే లేవని చెప్పాలి. అందుకే కొద్దిరోజులుగా ఊగిసలాటలో ఉన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భవితవ్యానికి కరోనా వరంలా మారిందట..
ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని మార్చడానికి కాంగ్రెస్ హైకమాండ్ చేసుకున్న ప్రణాళికలను విరమించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే కొద్ది నెలల వరకు ప్రస్తుత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డియే పదవిలో కొనసాగుతారట.. అధిష్టానం ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీహెచ్, జీవన్ రెడ్డి, పొన్నాల లాంటి సీనియర్లు నిరాశకు లోనవుతున్నారు. ఇక ఈ పదవిపై గంపెడాశలు పెట్టుకున్న రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబులు షాక్ కు గురవుతున్నారు.
టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని బుధవారంతో ఐదేళ్లు పూర్తవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తాడనే ఉద్దేశంతో పొన్నాల లక్ష్మయ్య స్థానంలో ఉత్తమ్ ను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కాంగ్రెస్ ను విజయం దిశగా నడిపించలేకపోయారు. ఘోరంగా విఫలమయ్యాడు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని ఎన్నికల్లోనూ ఉత్తమ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఓడిపోయింది. స్వయంగా ఆయన గెలిచిన హుజూర్ నగర్ లోకూడా కాంగ్రెస్ ను ఉత్తమ్ గెలిపించలేకపోయాడు.
గత ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఓటమితో ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి.. హైకమాండ్ కూడా దీనిపై సమాలోచనలు చేసింది. రేవంత్ రెడ్డి కొత్త టీపీసీసీ చీఫ్ అవుతారని బాగా ప్రచారం జరిగింది. మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి.
అయితే వీరిందరి ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. ప్రస్తుత సంక్షోభంలో హైకమాండ్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ను మార్చే యోచనను విరమించుకుంది. దీంతో ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉత్తమ్ ను అభినందించడం తప్ప కాంగ్రెస్ నాయకులకు మరో ఆప్షన్ లేకుండా పోయింది.