Begin typing your search above and press return to search.
జగన్ బాటలోకి... ఉత్తమ్ వచ్చేశారు!
By: Tupaki Desk | 15 March 2017 8:29 AM GMTతెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పూర్తి కాలం పాలన సాగించలేవన్న కథనాలకు మరింత బలం చేకూరినట్లుగానే కనిపిస్తోంది. ఏపీలోని చంద్రబాబు సర్కారుపై ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదే తరహా వాదనను వినిపించిన సంగతి తెలిసిందే. సంపూర్ణ మెజారిటీతోనే ఏర్పాటైన చంద్రబాబు సర్కారు పూర్తికాలం మనలేదని, నిర్ణీత కాల వ్యవధి కంటే కూడా ముందుగానే ఎన్నికలు రావడం తథ్యమేనని, ఆ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవడం, వైసీపీ అధికారం చేపట్టడం ఖాయమని జగన్ చాలా సార్లు ప్రస్తావించారు. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ మాట ఎలా ఉన్నా... సామాన్య జనం మాత్రం జగన్ చెప్పినట్లుగా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదని కూడా భావించారు.
ఇక చంద్రబాబు ప్రభుత్వం కంటే కూడా మరింత మెజారిటీ స్థానాలతో తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్... తనదైన మార్కు పాలనతో దూసుకెళుతున్నారు. కొత్త రాష్ట్రంలో సరికొత్త సంక్షేమ పథకాలతో కేసీఆర్ పాలన సాగుతోంది. విపక్షాలు ఎంతమేర విమర్శనాస్త్రాలు సంధించినా... కేసీఆర్ ఏమాత్రం వెనుకంజ వేయకుండా ముందడుగే వేస్తున్నారు. విపక్షాలన్నింటినీ ఓ చాపలో చుట్టేస్తున్న ఆయన 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో నిన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
2019 దాకా తెలంగాణలో కేసీఆర్ సర్కారు పాలన సాగేలా లేదని చెప్పిన ఆయన... 2018లోనే ఎన్నికలు రావడం ఖాయంగానే కనిపిస్తోందని, ఏడాది ముందుగా ఎన్నికలు వచ్చినా కూడా తాము సర్వసన్నద్ధంగానే ఉన్నామని చెప్పేశారు. తెలంగాణ బడ్జెట్‌లోని అంశాలను ఆసరా చేసుకుని ఉత్తమ్ చేసిన ఈ వాదన కాస్తంత ఆసక్తికరంగానే ఉందని చెప్పక తప్పదు. అయినా కేసీఆర్ సర్కారు భవిష్యత్తుపై ఉత్తమ్ ఏమన్నారంటే... *బడ్జెట్‌లో వివిధ వర్గాలకు ఇవ్వజూపిన తాయిలాలను చూస్తుంటే టీఆర్‌ఎస్ సర్కారు మధ్యంతర ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు కనపడుతోంది. 2018లో ఎన్నికలకు వెళ్లినా సరే మేము సిద్ధం* అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/