Begin typing your search above and press return to search.
కూతురు బర్త్ డే పార్టీ కి పిలిచి 24 మంది కిడ్నాప్.. చివరికేమైందంటే?
By: Tupaki Desk | 31 Jan 2020 5:30 AM GMTమనిషిలోని ఉన్మాదం ఎప్పుడేం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. తాజాగా చోటు చేసుకున్న సంచలన ఉదంతం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. తనను ఒక కేసులో అందరూ కలిసి ఇరికించారని ఫీలైన ఒక నేరస్తుడు.. ఊరిపై పగ పెంచుకొని అనూహ్యంగా వ్యవహరించిన వైనం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఫరూకాబాద్ కు చెందిన సుభాష్ బాథమ్ అనే వ్యక్తికి ఒక హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఒక మహిళను హత్య చేశారన్న ఆరోపణ అతని పై ఉంది. హత్య జరిగిన సమయం లో తాను అక్కడ లేనని చెబితే.. అతడు ఉన్నాడని గ్రామస్తులు చెప్పటంతో అతడికి శిక్ష పడింది. దీంతో ఊరి మీద కోపం పెంచుకున్న అతగాడు.. తాజాగా పెరోల్ మీద బయటకు వచ్చాడు. గురువారం మధ్యాహ్నం కసారియా గ్రామంలోని తమ ఇంటికి సమీపం లోని ఇళ్లకు వెళ్లాడు.
తన కుమార్తె పుట్టిన రోజు ఉందని.. పిల్లల్ని పంపాలని కోరాడు. తనను తాను మారిపోయిన వ్యక్తిగా నమ్మించాడు. దీంతో.. అందరూ తమ పిల్లలు పంపగా.. కొందరు మహిళలు కూడా బర్త్ డే పార్టీ కోసం వెళ్లారు. అక్కడే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పుట్టినరోజు పార్టీకి వెళ్లిన 24 మంది పిల్లలు.. మహిళల్ని బంధించిన అతగాడు..అందరిని గదిలో పెట్టి గడియ పెట్టాడు. చివరకు తన భార్య.. కుమార్తె ను కూడా బంధీలలో ఉంచాడు.
పార్టీకి వెళ్లిన తమ వాళ్లు ఎంతకూ రాక పోవటం తో సుభాష్ ఇంటికి వచ్చారు. తన ఇంటికి వస్తే కాలుస్తానని చెప్పటమే కాదు.. ఒక వ్యక్తి మీద కాల్పులు జరపటంతో అక్కడి వారంతా హడలిపోయారు. జరిగిన ఉదంతాన్ని పోలీసులకు వివరించారు. వారు వెంటనే రంగంలోకి దిగారు. తాను ఎమ్మెల్యేతో మాట్లాడాలని చెప్పటంతో స్థానిక ఎమ్మెల్యే ను సాయంత్రం వేళకు తీసుకొచ్చారు. పార్టీకి వచ్చిన వారిని భయ పెట్టేందుకు ఆరు రౌండ్లు గాలిలో కాల్చినట్లుగా చెబుతున్నారు. నెలల పాపను మాత్రం సురక్షితంగా ఇచ్చేశాడు. తనను కేసులో అనవసరం గా ఇరికించారంటూ మండి పడ్డాడు.
ఈ వ్యవహారం గురించి తెలిసిన అధికారులు.. బందీలను విడిపించేందుకు ప్రత్యేక భద్రతా సిబ్బంది రంగంలోకి దించారు. ఈ నాటకీయ కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది. చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి స్వయంగా రంగంలోకి దిగారు. కిడ్నాపర్ సుభాష్ సంగతి చూడాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక భద్రతా సిబ్బంది ఆపరేషన్ నిర్వహించి.. సుభాష్ ను కాల్చేశారు. పిల్లల్ని.. మహిళల్ని సురక్షితంగా రక్షించారు. ప్రత్యేక ఆపరేషన్ తో భారీ టెన్షన్ నుంచి బయట పడేసిన ప్రత్యేక భద్రతా సిబ్బందికి అభినందనలతో పాటు రూ.10లక్షల రివార్డును సీఎం యోగి ప్రకటించారు. సినిమాటిక్ గా కనిపిస్తున్న ఈ వైనం యూపీలో సంచలనంగా మారింది.