Begin typing your search above and press return to search.

ఇది ఒక సామాన్యుడి కరెంటు బిల్లు

By:  Tupaki Desk   |   25 Dec 2015 8:45 AM GMT
ఇది ఒక సామాన్యుడి కరెంటు బిల్లు
X
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక చిన్న వ్యాపారస్తుడికి వచ్చిన కరెంటు బిల్లును చూసిన వెంటనే కరెంటు షాక్ కొట్టినట్లుగా బెదిరిపోయాడు. తనకు వచ్చిన బిల్లు మొత్తాన్ని లెక్క వేసేందుకే అతనికి కొద్ది నిమిషాలు పట్టింది. జాతీయ వినియోగదారుల దినోత్సవం రోజున విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక చిరు వ్యాపరస్తుడికి వచ్చిన బిల్లు సంచలనం సృష్టించింది. ఇంతకీ ఆయనకు వచ్చిన కరెంటు బిల్లు ఎంతోతెలుసా.. అక్షరాలా రూ.232.07కోట్లు మాత్రమే.

యూపీలోని మొరదాబాద్ లో చిన్న పరిశ్రమ నడిపే పరాగ్ మిత్తల్ కు వచ్చిన బిల్లు గండెలు అవిసేలా ఉంది. ఈ భారీ మొత్తాన్ని అతను వాడిన 300 కోట్ల యూనిట్లకు చెల్లించాలంటూ అధికారులు బిల్లు చేతికి ఇచ్చి వెళ్లిపోయారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మిత్తల్ కంపెనీకి 49 కిలోవాట్ల వరకు మాత్రమే విద్యుత్తు వాడుకునే వీలుంది. ఈ భారీ బిల్లు గురించి మీడియాలో రావటంతో అధికారులు స్పందించారు. సాంకేతికంగా జరిగిన లోపంతోనే ఈ భారీ బిల్లు వచ్చిందని చెబుతారు. అదేం చిత్రమో.. మరే సంస్థకు లేని సాంకేతిక లోపాలన్నీ విద్యుత్తు సంస్థలకే ఎందుకు వస్తాయో..?