Begin typing your search above and press return to search.

మతాంతర వివాహాలకు ఉత్తరప్రదేశ్ లో చెక్

By:  Tupaki Desk   |   3 Dec 2020 1:30 AM GMT
మతాంతర వివాహాలకు ఉత్తరప్రదేశ్ లో చెక్
X
మతాంతర వివాహాల ముసుగులో పెరిగిపోతున్న లవ్ జీహాద్ కేసులకు చెక్ పెట్టేందుకు ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాద్ ప్రభుత్వం రెడీ అయ్యింది. 44 సంవత్సరాల క్రితం అంటే 1976లో ఉత్తరప్రదేశ్ లో మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తు ఓ చట్టం చేశారు. ఆ చట్టాన్ని ఇపుడు యోగి ప్రభుత్వం రద్దు చేసేసింది. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని కొందరు లవ్ జీహాద్ కు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ చట్టం ఆధారంగా మతాంతర వివాహాలు చేసుకుని ఉద్దేశ్యపూర్వకంగా మత మార్పిడులకు కొందరు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

అప్పటి చట్టం ప్రకారం భిన్న మతాల వాళ్ళు వివాహాలు చేసుకుంటే రెండేళ్ళలోపు జిల్లా మెజిస్ట్రేట్ కు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు గనుక ఆమోదం పొందితే అప్పటి చట్టం ప్రకారం సదరు జంటకు ప్రభుత్వం తరపున రూ. 50 వేలు ప్రోత్సాహకంగా అందుతాయి. ఈ పద్దతిలో పోయిన సంవత్సరం 11 జంటలకు డబ్బులు ముట్టాయి. ఈ ఏడాది కూడా అలాంటి వివాహాలు జరిగినా ఏ ఒక్క జంటకు కూడా ప్రోత్సాహకం అందలేదు. అలాగే మరో నాలుగు దరఖాస్తులు మెజిస్ట్రేట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి.

ఇంతలోనే యోగి ప్రభుత్వం సదరు చట్టాన్ని రద్దు చేసేసింది. మతాంతర వివాహాల ముసుగులో మతమార్పిడి జరుగుతోందనే ఆరోపణలు ఉత్తర ప్రదేశ్ లో బాగా వినబడుతున్నాయి. అందుకనే సదరు చట్టాన్ని యోగి ప్రభుత్వం రద్దు చేసేసింది. ఇపుడు యూపీ ప్రభుత్వం మార్గంలోనే దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా మతాంతర వివాహాలను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరి దీనిపై మతాంతర వివాహాలు చేసుకోదలచుకున్న వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.