Begin typing your search above and press return to search.
యూపీ సంచలన నిర్ణయం: జూలై నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
By: Tupaki Desk | 23 Jun 2020 8:10 AM GMTప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉంది. అయినా తప్పని పరిస్థితుల్లో ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాలు చేసుకుంటున్నారు. పని చేసుకుంటూనే స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ వైరస్ సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే వైరస్ రాకతో ముందే అప్రమత్తమై విద్యాలయాలన్నీ మూసేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేసిన కూడా విద్యాలయాల ప్రారంభం చేయడం లేదు. వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉండడంతో విద్యార్థులకు వ్యాపిస్తుందనే భయంతో పునఃప్రారంభానికి ప్రభుత్వాలు సాహసించడం లేదు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాలు..ఆన్ లైన్ ద్వారా విద్యాబోధన చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
జూలై 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని ప్రకటించింది. అయితే ఇందులో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు తెరచినా విద్యార్థులు హాజరు కారు. ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మాత్రమే హాజరు కావాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రాథమిక విద్య డైరెక్టర్ జనరల్ విజయ్ కిరణ్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలకు హాజరయ్యే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు కొన్ని పనులు అప్పగించింది. శారదా అభియాన్ కింద 6 నుంచి 14 ఏళ్ల పిల్లలను పాఠశాలలో చేర్పిచాల్సి ఉంటుంది. గ్రామాల్లో ఉపాధ్యాయులు పర్యటించి పిల్లల వివరాలను సేకరించి వారి కోసం విద్యా ప్రణాళికను సిద్ధం చేయాలి. దీక్షా యాప్ ద్వారా నూతన అంశాలలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. వివిధ తరగతుల విద్యార్థులకు పుస్తకాలను అందజేయాలి. విద్యార్థుల యూనిఫారాలకు సంబంధించిన పనులను చేపట్టాలి. తదితర పనులు ఉపాధ్యాయులకు అప్పగించింది. అయితే ప్రైవేటు పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.