Begin typing your search above and press return to search.

దేశంలో తొలి హెలి ట్యాక్సీ వచ్చేసింది

By:  Tupaki Desk   |   21 Jan 2016 7:30 PM GMT
దేశంలో తొలి హెలి ట్యాక్సీ వచ్చేసింది
X
రెండు పట్టణాల మధ్య సిటీ బస్సు సర్వీసు.. ఆటోలు.. ట్యాక్సీలు లాంటి సర్వీసులు మామూలే. కానీ.. తొలిసారి దేశంలో రెండు ఊళ్ల మధ్య హెలి ట్యాక్సీ అందుబాటులోకి వచ్చింది. ఉత్తరాఖండ్ లోని హిమాలయ గిరుల మధ్యనున్న ఈ రెండు ప్రాంతాలకు కొత్త తరహా రవాణాసౌకర్యం అందుబాటులోకి రావటం ఒక విశేషమైతే.. దేశంలో ఇదే మొదటిది కావటం మరో ప్రత్యేకత.

హల్దావనీ.. మున్ షియాన్ ఊళ్ల మధ్య మొదలైన ఈ హెలీ ట్యాక్సీ ఎక్కేస్తే.. హిమాలయ అందాల్ని అస్వాదించే వీలు కలుగుతుంది.ఈ రెండు ఊళ్ల మధ్య 45 నిమిషాల పాటు ప్రయాణం సాగుతుంది. ఐదుగురు ప్రయాణికులు ప్రయాణించే వీలున్న ఈ హెలికాఫ్టర్ కు వెళ్లేటప్పుడు రూ8వేలు.. తిరిగి వచ్చే టప్పుడు మాత్రం రూ.15వేలు ఛార్జ్ చేస్తుండటం గమనార్హం. దేశంలోనే మొదటిదైన ఈ తరహా హెలికాఫ్టర్ సర్వీసు పర్యాటకుల్ని మరింత ఆకర్షించటం ఖాయమంటున్నారు.