Begin typing your search above and press return to search.

ఉత్తరాఖండ్లో హోరాహోరీ.. హంగ్ దిశ‌గా ప్ర‌జ‌ల తీర్పు

By:  Tupaki Desk   |   7 March 2022 2:47 PM GMT
ఉత్తరాఖండ్లో హోరాహోరీ.. హంగ్ దిశ‌గా ప్ర‌జ‌ల తీర్పు
X
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ క్రమంలో దేవ‌భూమిగా పేర్కొనే ఉత్త‌రాఖండ్‌లో ప్ర‌జ‌లు ఏ పార్టీకి భారీ మెజారిటీ క‌ట్ట‌బెట్టే ప‌రిస్థితిలేద‌ని స్ప‌ష్ట‌మైంది. ముఖ్యంగా బీజేపీ నేత‌లు పెట్టుకున్న ఆశ‌లు కూడా ఇక్కడ ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు.

మినీ సార్వత్రిక సమరంగా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. అంతకుముందే.. ఫలితాల ధోరణిని అంచనా వేస్తూ విశ్లేషిస్తూ ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఎవరిదోనని చెప్పేస్తాయి.

సర్వేల ద్వారా ఓటర్ల నాడిని పసిగడతాయి. తాజాగా ఈ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఉత్త‌రాఖండ్ రాష్ట్రం విష‌యానికి వ‌స్తే.. అన్ని ఎగ్జిట్‌పోల్ స‌ర్వేలు.. కూడా ఇక్క‌డ ఏ పార్టీ ఏక‌ప‌క్షంగా అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని.. హంగ్ ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని తేల్చి చెప్పాయి.

అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పుంజుకునే ప‌రిస్థితి కూడా త‌క్కువ‌గానే ఉంద‌ని ఎగ్జిట్ పోల్ స‌ర్వే అంచ‌నా వేసింది. అయితే.. ప్ర‌ధాన పోటీ మాత్రం బీజేపీ-కాంగ్రెస్ ల మ‌ధ్యే ఉంది. ఈ ఫ‌లితాలు.. ఎలా ఉన్నాయంటే..

ఉత్త‌రాఖండ్‌.. మొత్త స్థానాలు.. 70
ఏబీపీ- సీ ఓటర్‌
బీజేపీ 26-32 కాంగ్రెస్‌ 32-38 ఆప్‌- 0-2,ఇతరులు 3-7
టు-డేస్‌ చాణక్య
బీజేపీ 36-50 కాంగ్రెస్‌ 17-31 ఆప్‌- 0 బీఎస్పీ- 0 ఇతరులు 0-6
జన్‌కీ బాత్‌
బీజేపీ 32-41 కాంగ్రెస్‌ 27-35 ఆప్‌- 0-1, బీఎస్బీ 0-1 ఇతరులు 3
టైమ్స్‌ నౌ- వీటో
బీజేపీ 37 కాంగ్రెస్ 31 ఆప్‌- 1, ఇతరులు 1
మ్యాట్ర్జిజ్‌
బీజేపీ- 29-34 కాంగ్రెస్‌ 33-38 బీఎస్పీ 1-3 ఆప్‌- 0 ఇతరులు 1-3