Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ : చిన్నారి మొదటి పుట్టిన రోజుకి పోలీస్ ఎస్కార్ట్ ..ఎక్కడంటే ?
By: Tupaki Desk | 6 May 2020 12:10 PM GMTదేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ..ఆ తరువాత ఒక్కొక్క దేశానికీ పాకుతూ మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ మహమ్మారి కట్టడి కోసం ... ఇప్పటికే లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో మార్చి 24 నుండి ఏప్రిల్ 14 వరకు ,తరువాత దీనిని మే 3 వరకు పొడిగించారు. ఇప్పుడు మే 17 వరకు పొడిగించారు.
ఈ కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అనేక వివాహాలు వాయిదా పడ్డాయి. అలాగే పుట్టినరోజులు కూడా జరుపుకోవడం లేదు. సాధారణంగా పిల్లల మొదటి పుట్టినరోజు అయితే, తల్లిదండ్రులు దీనిని జరుపుకోవడానికి అనేక ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తారు. కానీ , ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనీసం పిల్లలకి కేక్ కూడా కట్ చేపించే స్థితిలో లేరు. అయితే , దేశంలో అక్కడక్కడా కొంతమంది పోలీసులు ... స్వయంగా ముందుకు వచ్చి పిల్లల పుట్టిన రోజులని సెలెబ్రేట్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.
ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో ఓ బాలిక మొదటి పుట్టినరోజును జరిపేందుకు పోలీసు వాహనాలు కవాతుగా వచ్చాయి. ఆ పాప ఇంటి వద్దకి రాగానే ..పోలీసులు ఫేస్ షీల్డ్ మరియు గ్లౌజులు ధరించి పిల్లలకి కేక్ ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సాధారణంగా, రాజకీయ నాయకులు మరియు వివిఐపిలు నడిపే వాహనాలతో పాటు ఎస్కార్ట్ దళాలు సైర్ అవుతాయి. ఈ కార్యక్రమంలో శిశువు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఎస్కార్ట్ దళాలు వచ్చాయి. ఆ చిన్నారి మొదటి పుట్టిన రోజుని జరపడానికి ఎస్కార్ట్ వాహనాలు వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఎస్కార్ట్ క్యాన్వాయ్ లో రెండు బజాజ్ పల్సర్ బైక్‌లు, తరువాత మూడు టయోటా ఇన్నోవా మరియు చివర్లో రెండు బజాజ్ పల్సర్ బైక్‌లు ఉన్నాయి. ఈ వాహనాలన్నీ వేర్వేరు రంగుల బెలూన్లతో అలంకరించబడి ఉన్నాయి.