Begin typing your search above and press return to search.

రాష్ర్టపతి ఎలక్షన్లు బీజేపీకి అంత ఈజీ ఏమీ కాదట..

By:  Tupaki Desk   |   2 March 2017 7:45 AM GMT
రాష్ర్టపతి ఎలక్షన్లు బీజేపీకి అంత ఈజీ ఏమీ కాదట..
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడం అంత సులభమేమీ కాదట. యూపీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకోబోయే సీట్లే కీలకం కానున్నాయి. యూపీలో కనీసం 150 సీట్లలో గెలుపుతో పాటు అన్నాడీఎంకే పార్టీ మద్దతు ఉంటేనే బీజేపీకి పని సులభమవుతుంది. లేదంటే ఇబ్బంది తప్పదట.

ఒకవేళ విపక్షాలన్నీ ఏకమై వారు అభ్యర్థిని నిలిపితే ఆ అభ్యర్థే గెలిచే ఛాన్సులుంటాయని చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు - ఎమ్మెల్యేల ఓటింగ్ విలువలన్నీ కలిపితే, మొత్తం 10,98,882 పాయింట్లు ఉన్నాయి. మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 4,120 కాగా వారి ఓట్ల విలువ 5,49,474 పాయింట్లు. లోక్ సభలో 543 - రాజ్యసభలోని 233 మంది ఎంపీల ఓట్ల విలువ 5,49,408 పాయింట్లు కాగా - ఈ లెక్క ప్రకారం విజయానికి 5,49,442 పాయింట్లు అవసరం.

ప్రస్తుతం బీజేపీ వద్ద 3.80 లక్షల పాయింట్లకు సమానమైన ఓట్లున్నాయి. విజయానికి కావాల్సిన 5.49 లక్షల ఓట్లతో పోలిస్తే, బీజేపీకి ఇంకా 1.70 లక్షల ఓట్లు అవసరం. బీజేపీకి మద్దతిస్తున్న ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీలకు సుమారు లక్షకు పైగా పాయింట్లు ఉండటంతో, మరో 70 వేల పాయింట్లను ఆ పార్టీ తెచ్చుకోవాల్సివుంది. ప్రస్తుతం జరుగుతున్న యూపీ ఎన్నికల్లో 403 ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, మొత్తం 83,824 పాయింట్లు లభిస్తాయి. రాష్ట్రంలోని జనాభా ఆధారంగా ఎమ్మెల్యేల ఓటుకు లభించే పాయింట్లను లెక్కిస్తారన్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం, అత్యధిక జనాభా ఉన్న యూపీలో ఎమ్మెల్యే ఓటుకు 208 పాయింట్లు లభిస్తాయి. ఇదే సమయంలో సిక్కిం శాసన సభ్యుల ఓటుకు కేవలం 7 పాయింట్లు మాత్రమే దక్కుతాయి. ఇక తమ విజయానికి కావాల్సిన 70 వేల ఓట్ల సంపాదన ఆ పార్టీకి అంత సులువేమీ కాదని తెలుస్తోంది.

యూపీ ఎన్నికల్లో 150 సీట్లను ఆ పార్టీ గెలుచుకుంటే, 31,200 పాయింట్లు, కనీసం 100 సీట్లను గెలుచుకుంటే, 20,800 పాయింట్లు లభిస్తాయి. దీంతో 37 లోక్ సభ, 13 రాజ్యసభ సీట్లున్న అన్నాడీఎంకేకు 35,400 పాయింట్లున్నాయి. తమిళనాడు అసెంబ్లీలోని ఆ పార్టీ ఎమ్మెల్యేల ఓట్ల విలువ 23,760 కావడంతో ఆ పార్టీ మద్దతిచ్చి, యూపీ ఎన్నికల్లో సత్తా చాటితే బీజేపీ గెలుపు సులువవుతుంది. అయితే.. యూపీలో అనుకున్నన్ని సీట్లు వచ్చినా అన్నాడీఎంకే మద్దతివ్వడం మాత్రం అంత ఈజీ కాదంటున్నారు. దీంతో బీజేపీకి రాష్ట్రపతి ఎలక్షన్లు టఫ్ గా ఉండబోతున్నాయని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/