Begin typing your search above and press return to search.

'సైరా..' ఉయ్యాలవాడను మోడీ ప్రభుత్వం ఎలా సత్కరించిందో తెలుసా?

By:  Tupaki Desk   |   25 Sep 2019 5:30 PM GMT
సైరా.. ఉయ్యాలవాడను మోడీ ప్రభుత్వం ఎలా సత్కరించిందో తెలుసా?
X
మన చరిత్ర గురించి చాలా విషయాలను మనమే గమనిస్తూ ఉండటం. ఈ రోజు కలర్ ఫుల్ గా, ఒక భారీ సినిమా వస్తోంది కాబట్టి.. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇది వరకూ రాయలసీమ ప్రాంతాన్ని, ప్రత్యేకించి కుందూనదికీ అటూ ఇటూ ఉన్న రేనాడు ప్రాంతానికి తప్ప ఉయ్యాలవాడ ఎవరికీ పట్టలేదు. రాయలసీమలోని రెడ్ల సంఘాలు గట్రా.. ఉయ్యాలవాడ గురించి ప్రస్తావిస్తూ ఉన్నాయి కొన్ని దశాబ్దాల నుంచి. అంతకు మించి ఉయ్యాలవాడ ఎవరికీ పట్టలేదు.

అయితే జనాలు పెద్దగా గుర్తించని మరో విషయం ఏమిటంటే.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తగు రీతిలో గుర్తింపును ఇచ్చింది. ఆయన పేరు - ఊహా చిత్రంతో పోస్టల్ స్టాంప్ ను - ఎన్వలప్ ను ఇది వరకే కేంద్రం విడుదల చేసింది. ఆ పోస్టల్ స్టాంప్ - ఎన్వలప్ కవర్ ఎలా ఉంటుందో.. ఈ వీడియోలో చూడవచ్చు. అలాగే ఉయ్యాలవాడ కథ ఎలా దశాబ్దాల కాలన మరుగున పడిపోకుండా - ఎలా ఆయన ఉనికి రేనాడు-రాయలసీమ ప్రజల మధ్యలో నిలిచిందో.. జానపదులు ఆయన గాథను ఎలా పాడారో కూడా ఈ వీడియోలో వీక్షించవచ్చు.ఉయ్యాలవాడ వాడిన కత్తిని - ఉయ్యాలవాడ సంచరించిన పరిసరాలనూ చూడవచ్చు.