Begin typing your search above and press return to search.

ఆబ్సెంట్‌ నాయకులకు ఫిటింగ్‌ పెట్టేసినట్టే!

By:  Tupaki Desk   |   14 Sep 2015 10:46 AM GMT
ఆబ్సెంట్‌ నాయకులకు ఫిటింగ్‌ పెట్టేసినట్టే!
X
తెలంగాణలో ప్రస్తుతం రైతు ఆత్మహత్యలు ముమ్మరంగా జరుగుతున్న వ్యవహారాన్ని అన్ని రాజకీయ పార్టీలూ తమ తమ ఎదుగుదలకు - విస్తరణకు అనుకూలంగా వాడుకుంటూ ఉన్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ చాలా ముందంజలో ఉంది. తెలుగుదేశం పార్టీ కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమౌతోంది. ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలని, ఐదులక్షల వంతున ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని ప్రకటనల వరకే తెదేపా ఊరుకుంటోంది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆందోళనలు నిర్వహిస్తోంది. మృతిచెందిన వారి కుటుంబాలను వెళ్లి పరామర్శిస్తోంది. వారిలో కొందరికి ఆర్థిక సహాయం అందేలా చూస్తోంది. కాగా రాజ్యసభ ఎంపీ సీనియర్‌ నాయకుడు వీ హనుమంతరావు.. ఈ పోరాటాల్లో చాలా యాక్టివ్‌ గా కనిపిస్తున్నారు. ఆయన ఊరూరా పోరాటాల్లో పాల్గొంటున్నారు.

తాజాగా ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ లోని పలువురు నాయకులకు ఫిటింగ్‌ పెట్టేశారని పార్టీలో చెప్పుకుంటున్నారు. రైతు ఆత్మహత్యల గురించి ప్రభుత్వం మీద ఆరోపణల గుప్పించడంలో కాంగ్రెస్‌ నాయకులంతా ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అయితే కొందరు కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఈ విషయంలో పెదవి విప్పకుండా.. మిన్నకుండిపోతున్నారు. రైతుల పరామర్శకు వెళ్లడానికి కూడా రాకుండా ఇళ్లకు పరిమితం అవుతున్న నాయకులు పలువురు ఉన్నారు. ఉదాహరణకు వీరిలో సీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌ జానారెడ్డిని కూడా చెప్పుకోవచ్చు. నారాయణఖేడ్‌ లో కిష్టారెడ్డి సంతాపసభ జరిగితే.. సీఎల్పీ నాయకుడిగా బాధ్యత గనుక.. ఆ కార్యక్రమానికి వెళ్లిన జానారెడ్డి.. రైతు ఆత్మహత్యల మీద మాత్రం పెద్దగా ఉద్యమించడం లేదు.

అయితే కాంగ్రెసులో రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీయకుండా - పోరాడకుండా ఉన్న నాయకుల పేర్లను జాబితాగా రాసి టీపీసీసీ చీఫ్‌ ఉత్తంకుమార్‌ రెడ్డికి అందించినట్లుగా వీహెచ్‌ ప్రకటించారు. అయితే రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ అధిష్ఠానం వద్దకు తీసుకువెళుతూ.. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండే వీహెచ్‌.. ఈ జాబితాను ఢిల్లీ కూడా పంపే ఉంటారని.. ఆ రకంగా.. రాష్ట్రంలోని కొందరు నాయకులు ఆయన పూర్తిగా ఫిటింగ్‌ పెట్టేశారని పార్టీలో చర్చించుకుంటున్నారు. వీహెచ్‌ ఎవరెవరిని ఇలాంటి 'అనాసక్తి నాయకులు'గా జాబితాలో ఇరికించారో.. వారికి అధిష్ఠానం ఎలాంటి క్లాసు పీకుతుందో చూడాలి.