Begin typing your search above and press return to search.
ఇలా చేస్తేనే..బీసీలపై కేసీఆర్ ప్రేమ తెలుస్తుంది
By: Tupaki Desk | 16 Jan 2018 11:06 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ పీసీసీ చీఫ్ వీ హనుమంతరావు మండిపడ్డారు. కేసీఆర్ మరో కపట నాటకానికి తెరతీశారని ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కేసీఆర్ కు గ్రామాలు - బీసీలు కనబడుతున్నారని ఆరోపించారు. ఈ నాలుగు సంవత్సరాల నుండి బీసీలు కేసీఆర్‌కు గుర్తు లేరని ఆయన ఎద్దేవా చేశారు.బీసీలకు క్యాబినెట్ లో తగిన ప్రాధాన్యత కల్పించలేదని వీహెచ్ అన్నారు. కేసీఆర్ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని...బీసీలు కేసీఆర్ కపట ప్రేమను అర్థం చేసుకోవాలని కోరారు.
కులాల మధ్య కేసీఆర్ చిచ్చు పెడుతూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. పరోక్ష ఎన్నికలు పెట్టి గ్రామలో కేసీఆర్ చిచ్చు పెడుతున్నారని ఆక్షేపించారు. పంచాయతీ రాజ్ చట్టాన్ని వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. పరోక్ష ఎన్నికలో డబ్బులు ఉన్నవారే గెలుస్తారని, అసెంబ్లీలో ఈ బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీలో ప్రజల తరపున పోరాడతామని వీహెచ్ తెలిపారు.
కేసీఆర్‌కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే క్రిమిలేయర్ ఎత్తివేయాలని వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. బీసీ - ఎస్సీల అభివృద్ధి కోసం పీసీసీ - సిఎల్పీ - పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తొందర్లోనే మీటింగ్ ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ వర్గాలను సంఘటితం చేసుకొని ముందుకు సాగడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవచ్చునని ఆయన వివరించారు.