Begin typing your search above and press return to search.

సీఎం అవ్వాల్సిన వీహెచ్ ఏమయ్యాడు.?

By:  Tupaki Desk   |   6 May 2019 5:18 PM IST
సీఎం అవ్వాల్సిన వీహెచ్ ఏమయ్యాడు.?
X
ఫ్రస్టేషన్.. హాలోజినేషన్.. ఇలా నవరసాలు ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు లో కనిపిస్తున్నాయి.. ప్రజలు తీర్పునిచ్చి పట్టుమని పదిమాసాలు కాకముందే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం న్యాయమా అని అందరూ అడగదలుచుకున్నారు.. పోనీ పెద్దాయన ఏందో లొల్లి చేస్తున్నాడు అనుకుంటే అధికారపక్షాన్నే కాదు.. స్వపక్షాన్ని కూడా ఇరుకునపెట్టేలా మాట్లాడుతుండడం కాంగ్రెస్ శిబిరాన్ని డిఫెన్స్ లో పడేస్తున్నాయి.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ లో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమవుతున్నాయనే సబ్జెక్ట్ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన వీహెచ్.. తెలంగాణలో ఇంటర్ ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలేనని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలని.. ఇంటర్మీడియెట్ సెక్రెటరీని సస్పెండ్ చేయాలని నినదించారు. పనిలో పనిగా తను ఉంటున్న కాంగ్రెస్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసి ఇరుకున పెట్టారు..

కాంగ్రెస్ పార్టీలో అగ్రకుల ఆధిపత్యం ఉందని వీహెచ్ వ్యాఖ్యానించి కలకలం రేపారు. 1990లో తనకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా బీసీ అని చెప్పి ముఖ్యమంత్రి కాకుండా కాంగ్రెసోళ్లు అడ్డుకున్నారని వీహెచ్ వాపోయారు. బీసీ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ బాగుపడుతుందని చెప్పుకొచ్చారు. ఇలా ఫ్యాష్ బ్యాక్ లో తాను సీఎం అవ్వాల్సిన అభ్యర్థిని అని గొప్పలు చెప్పుకునేందుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నే పావుగా వాడేశారు వీహెచ్. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో దుమారం రేపడంతో ఇప్పుడు ఆయన ఎలా సరిదిద్దుకుంటారో వేచిచూడాలి.